తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షులు సీమ శ్రీనివాస్ కు విన్నపము

*తెలంగాణ ఉద్యమకారుల అధ్యక్షులు సీమ శ్రీనివాస్ కు విన్నపము*

ప్రశ్న ఆయుధం న్యూస్ ఏప్రిల్ 13

కొత్తగూడెం డివిజన్ ఆర్ సి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డకా ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల స్థానిక రిజర్వేషన్ జనరల్ లో కలపడం వల్ల ఉద్యోగ,ఉపాధి, రాజకీయపరంగా హక్కు కోల్పోయి అన్యాయం జరిగిందని తెలంగాణ ఉద్యమకారుల రాష్ట్ర అధ్యక్షులు సీమ శ్రీనివాసుకు షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ వినతి పత్రం అందజేసి వివరించారు.ఏజెన్సీ ప్రాంతంలో ఎస్సీ కులాలకు జరుగుతున్న అన్యాయంపై తెలంగాణ ఉద్యమకారులసంఘo తరపున కాంగ్రెస్ ప్రభుత్వాo రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లెటర్ ఇవ్వాలని కోరారు.స్పందించిన సీమ శ్రీనివాస్ ఏజెన్సీ ప్రాంత ఎస్సి కులాల ఉద్యమానికి మద్దతు తెలుపుతూ సానుకూలంగా స్పందించారని తెలియజేశారు.ఈ సందర్భంగా షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర సీనియర్ నాయకులు గోడ్ల మోహన్ రావు,కత్తి బాలకృష్ణ,రజిని అంబేద్కర్,సలిగంటి కొమరయ్య తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment