తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) జూన్ 30
టీయూఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.ఎల్. యన్.చారి డిమాండ్
నిజామాబాద్, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధనలో అలుపెరుగని పోరాటం చేసిన రాష్ట్ర ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పి,కాలం గడుస్తున్నా ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా మాయమాటలతో మభ్యపెడుతూ, ప్రభుత్వం కాలయాపన చేస్తుందని నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు డి. ఎల్.యన్.చారి అన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, టీయూఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు నేడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిజామాబాద్ కేంద్రంలో నిర్వహించిన శాంతియుత దీక్షకు ఉద్యమకారులు హాజరై దీక్షను విజయవంతం చేసి,సంఘీభావం తెలిపిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మీర్జాపురం రామకృష్ణ, సితార్ల సురేష్, కేతవత్ రమేష్, సుమన్ తదితరులు పాల్గొన్నారు.