Headlines:
-
“తెలంగాణలో ప్రజా వ్యతిరేక పాలనపై బీజేపీ ఆగ్రహం”
-
“కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ మండిపడిన నేరెళ్ల ఆంజనేయులు”
-
“రైతుల సమస్యలపై నిర్లక్ష్యం – కాంగ్రెస్ పాలనలో మోసం అని ఆరోపణలు”
రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం*
*బీజేపీ రాష్ట్ర నాయకుడు నేరేళ్ళ ఆంజనేయులు*
*ఇల్లందకుంట అక్టోబర్ 27 ప్రశ్న ఆయుధం*
ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన కొనసాగుతుందని మాజీ మంత్రి బీజేపీ రాష్ట్ర నాయకుడు నేరెళ్ల ఆంజనేయులు అన్నారు. హుజురాబాద్ నియోజకవర్గ బిజెపి సభ్యత్వ నమోదు సమీక్షలో బాగంగా ఆదివారం రోజు ఇల్లంధకుంట హాజరై మాట్లాడుతూ 6 గ్యారంట్ల పేరుతో చెప్పి 420 హామీలు ఇచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను తుంగలో తొక్కి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తుందని మాజీ మంత్రి ఆంజనేయులు మండిపడ్డారు రాష్ట్రంలో నేటి వరకు పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీ కాలేదని రైతు భరోసా దిక్కేలేదని మహిళలకు ఇచ్చిన హామీ మరిచిపోయారని ఇలా అనేక హామీలు హామీలు గానే మిగిలిపోయాయని మాజీ మంత్రి ఆంజనేయులు రాష్ట్ర ప్రభుత్వంపై ఆక్రోశించారు రాష్ట్ర ప్రభుత్వంపై వస్తున్న ప్రజా వ్యతిరేకతను తప్పించుకోవడానికి ప్రజల దృష్టిని మళ్ళించడానికి హైడ్రా మూసి అని కొత్త నాటకాలను తెరతీసాడని మాజీ మంత్రి దుయ్యబట్టారు రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక పాలన నడుస్తుందని త్వరలో దానికి చరమగీతం పాడడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారని మాజీ మంత్రి పేర్కొన్నారు మండలానికి వచ్చిన విషయమై మండలంలోని 29 బూత్ లల్లో జరిగిన సభ్యత్వ నమోదు గురించి మండల అధ్యక్షుడు సింగిరెడ్డి తిరుపతి రెడ్డిని అడిగి తెలుసుకొని ప్రతి బూత్ లో 200 పై చిలుకు బిజెపి సభ్యత్వాలు చేయడం పట్ల ఆంజనేయులు సంతోషం వ్యక్తం చేశారు బిజెపి కార్యకర్తల సమిష్టి కృషి కారణంగా మండలంలో పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు జరిగిందని సభ్యత్వ నమోదు చివరి రోజు వరకు కార్యకర్తలు ఇలాగే సమిష్టిగా పనిచేసి ప్రతి బూతులో 300 సభ్యత్వాలు పూర్తి పనిచేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు అనంతరం ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్ర స్వామి దేవుని దర్శించుకుని దేవాలయం యొక్క విశిష్టతను అర్చకుల సహాయంతో తెలుసుకున్నారు పురాతనమైన, పవిత్రమైన, విశిష్టత కలిగిన శ్రీరాముడు దేవాలయాన్ని దర్శించుకోవడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులు ఆనందం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి సంపత్ రావు జిల్లా కార్యదర్శి నరసింహ రాజు రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ పుప్పాల రఘు గురుకుంట్ల సాంబయ్య ఎండీ షఫీ ఖాన్ కొత్త శ్రీనివాస్ తడిగొప్పుల రమేష్ ఉప్పు దుర్యయ్య నల్లగొండ వినయ్ కమ్మగోని అజయ్ గురుకుంట్ల సంజీవ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు