తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలి

తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలి

 

– సిపిఎం జిల్లా కార్యదర్శి కందుకూరి చంద్రశేఖర్.

 

– కామారెడ్డి జిల్లా( ఇంచార్జ్ )

 

. (ప్రశ్న ఆయుధం) 11 సెప్టెంబర్

 

వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను ఈనెల 10 చాకలి ఐలమ్మ వర్ధంతి నుండి 17 వరకు జరిగే సాయుధ పోరాట వారోత్సవాలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి కందురి చంద్రశేఖర్ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతంలో నిజాం పాలనలో జరుగుతున్న దోపిడీ, దొరల పీడన, వెట్టిచాకిరికి దొరల జమీందారులు, జాగిర్దారులకు వ్యతిరేకంగా జరిగిన మహత్తర పోరాటంలో కమ్యూనిస్టు యోధాను యోధులు అనేక త్యాగాలు చేసి ప్రజలకు అండగా నిలబడ్డారని అన్నారు. భూమికోసం, భుక్తి కోసం పోరాటంలో 10 లక్షల ఎకరాల భూమిని పేదలకు పంచారని, మూడు వేల గ్రామ రాజ్యాలు ఏర్పడ్డాయని, వెట్టిచాగిరి రద్దు చేయబడిందని, జమీందారులను గ్రామాల నుండి తరిమికొట్టారని అన్నారు. మహత్తర పోరాట చరిత్రను బిజెపి వక్రీకరించి ముస్లిం రాజుకు వ్యతిరేకంగా హిందూ ప్రజలు పోరాటంగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తుందని విమర్శించారు. ఆ పోరాటంలో అనేకమంది ముస్లింలు ముగ్దీమ్ మోయీద్దిన్, సోయబుల్లా ఖాన్, షేక్ బందగి తదితరులు నిజాం పాలన వ్యతిరేకంగా విరోచితంగా పోరాడారని అన్నారు. ఈ రాష్ట్రంలో సాయుధ పోరాట నిజమైన వారసులు కమ్యూనిస్టులేనని అన్నారు. ఈ చరిత్రను జరపాలని చూస్తే సూర్యునిపై ఉమ్మేసినట్టేనని అన్నారు. ఈనెల పది నుండి 17 వరకు జరిగే సాయుధ పోరాట వారోత్సవాలను ప్రతి పల్లెల్లో ఘనంగా నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా నాయకులు వెంకట్ గౌడ్, కొత్త నరసింహులు, ఎండి ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now