ఈ నెల 30 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు!…ఈ అంశాలపై కీలక చర్చ
ఈ నెల 29న మంత్రివర్గ సమావేశం
ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎంపిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ!
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 30 నుంచి జరిగే అవకాశం ఉంది. ఈ నెల 29న మంత్రివర్గ భేటీ నిర్వహించనున్నారు. ఆ తరువాత రోజు నుంచి శాసన సభ సమావేశాలు నిర్వహించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇటీవల మృతి చెందిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌కు మొదటి రోజు సభలో సంతాపం ప్రకటించనున్నారు. ఈ సమావేశాల్లోనే ఉపసభాపతి ఎంపిక, కాళేశ్వరం కమిషన్ నివేదికపై చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం….