నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు…ఉదయం 10.30 గంటలకు ప్రారంభం

అసెంబ్లీ
Headlines
  1. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం – 10.30 గంటలకు మొదలవుతాయి
  2. మధ్యాహ్నం బీఏసీ సమావేశం – జీతాలు, పింఛన్ల చెల్లింపు, సవరణ బిల్లులు
  3. సోమవారం నుంచి అసెంబ్లీ సమావేశాలు – ప్రభుత్వ ప్రతిపాదనలు, చర్చలు
  4. అసెంబ్లీ సమావేశాల్లో 2024 సవరణ ఆర్డినెన్సులు ప్రవేశపెట్టనున్నారు
  5. ఏడాది పాలనపై వివరాలు – ప్రభుత్వ ప్రతిపాదనలు సమావేశంలో
*మధ్యాహ్నం బీఏసీ సమావేశం*

*సెషన్ ఎన్నిరోజులు నిర్వహించాలనే దానిపై క్లారిటీ*

*ఏడాది పాలనపై వివరించేందుకు ప్రభుత్వం సన్నద్ధం*

అసెంబ్లీ సమావేశాలు సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. తోలిరోజు వాయిదా అనంతరం మధ్యాహ్నం బీఏసీ సమావేశం నిర్వ హించనున్నారు. ఎన్నిబిల్లులు ప్రవేశపెట్టాలి? ఎన్నిరోజులు సమావేశాలు నిర్వహించాలి? ఏయే అంశాలపై చర్చించాలి? అనే దానిపై క్లారిటీ రానుంది. అదే విధంగా ఏడాది పాలనలో సాధించిన విజయాలతోపాటు పలు ప్రజోపయోగ బిల్లులను ఆమోదించనున్నట్లు సమాచారం. కాగా, తొలిరోజు సీఎం రేవంత్ రెడ్డి జీతాలు, పింఛన్ల చెల్లింపు, అనర్హతల తొలగింపు (సవరణ) ఆర్డినెన్స్-2024 ను సభ ముందుంచనున్నారు. పురపాలక సంఘాల ఆర్డినెన్స్ (సవరణ)-2024, హైదరాబాద్ మహానగర పాలక సంస్థ (సవరణ) ఆర్డినెన్స్- 2024 ప్రవేశపెట్టనున్నారు. అదే విధంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలంగాణ వస్తువుల, సేవలపన్ను (సవరణ) ఆర్డినెన్స్- 2024 బిల్లు, తెలంగాణ విద్యుత్ ఆర్థిక్ సంస్థ లిమిటెడ్ 9వ వార్షిక నివేదిక ప్రతి -2022″ 23ను ప్రవేశపెట్టనున్నారు. మంత్రి కొండా సురేఖ రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ లిమిటెడ్ 7వ వార్షిక నివేదిక (2021-2022), మంత్రి సీతక్క తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) ఆర్డినెన్స్-2024 టెబుల్ పై సభాపక్షంలో ఉంచనున్నట్లు అసెంబ్లీ సెక్రటరీ నర్సింహాచా ర్యులు తెలిపారు. సమావేశాలకు అధికార, ప్రతిపక్ష సభ్యులు ఎవరికి వారిగా రెడీ అవుతు న్నారు. ఒకరిపై ఒకరు పై చేయి సాధించేందుకు వ్యూహాలను రచించుకుంటున్నారు.

Join WhatsApp

Join Now