జనతా గ్యారేజీలా తెలంగాణ భవన్..
సమస్యలు చెప్పుకోవడానికి క్యూ కట్టిన హైడ్రా బాధితులు…
హైడ్రా, ఆపరేషన్ మూసి పేరుతో నోటీసులు ఇవ్వకుండానే తమ ఇళ్లు కూల్చేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తమ గోడు వినాలని న్యాయం చేయాలని వారంతా తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు జనతా గ్యారేజీ సినిమాలో వివిధ సమస్యలు చెప్పుకోవడానికి జనతా గ్యారీజీని సంప్రదించినట్టుగానే ఇప్పుడు బీఆర్‌ఎస్ ఆఫీస్‌కు హైడ్రా బాధితులు క్యూ కడుతున్నారు. ఉదయం నుంచి ఆ ప్రాంతమంతా జనంతో కిక్కిరిసిపోయింది. ప్రజా సమస్యలు వినేందుకు మాజీ మంత్రులు, బీఆర్‌ఎస్‌లో కీలక నేతలంతా ఆఫీస్‌లోనే ఉంటున్నారు. బాధితులు చెబుతున్న సమస్యలను వింటున్నారు. వాటిని నోట్ చేస్తున్నారు.