ఆరు గ్యారంటీ లను పూర్తి స్థాయిలో అమలుపరిచే విధంగా తెలంగాణ బడ్జెట్

ఆరు గ్యారంటీ లను పూర్తి స్థాయిలో అమలుపరిచే విధంగా తెలంగాణ బడ్జెట్

●తెలంగాణలో రైతును రాజుగా చెయ్యడమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీనేతృత్వంలోప్రజాప్రభుత్వం భారీ బడ్జెట్‌!

●కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పులి మామిడి నవీన్ గుప్త!!

ప్రశ్న ఆయుధం న్యూస్ జులై 25(మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రిమల్లు భట్టీ విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేల ఆరు గ్యారంటీ లను పూర్తి స్థాయిలో అమలుపరిచే విధంగా తెలంగాణ బడ్జెట్ ప్రవేశ పెట్టిందని మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులుపులిమామిడి నవీన్ గుప్త అన్నారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను ప్రవేశ పెట్టిన బడ్జెట్అన్ని రంగాల అభివృద్ధికి, అన్ని వర్గాల సంక్షేమానికి, ఉపయోగపడే విధంగా పూర్తి సమతుల్యతతో ఉన్నది.
రాష్ట్ర ఆదాయ వనరులకు, అవసరాలకు, ప్రభుత్వ లక్ష్యాలకు నడుమ సమన్వయాన్ని.. బడ్జెట్ కూర్పు సాధించింది.వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యం ఇస్తూ ఏకంగా రూ. 72,659 కోట్లు కేటాయించింది. అలాగే రూ. 2 లక్షల రుణమాఫీ పథకానికి సైతం మరో 31,000 కోట్లు ప్రతిపాదించింది. ఆ తర్వాత ప్రాధాన్యంగా విద్య, వైద్యం, ఎస్సీ, ఎస్టీ బీసీ, సంక్షేమం, నీటి పారుదల రంగాలకు పెద్దమొత్తంలో కేటాయింపులు ఉన్నాయి.కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు భరోసా కల్పిస్తూ ఆయా పథకాలకు కేటాయింపులు చేసింది అన్నారు.కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పడిన ఇందిరమ్మ రాజ్యంలోని ప్రజా ప్రభుత్వం సంక్షేమం- అభివృద్ధి కి సమభాగంలో నిధులు వెచ్చిస్తూ మేలు కలయికతో ముందుకు తీసుకువెళ్తున్నారు.ఇందిరమ్మ రాజ్యంలో ప్రజా ప్రభుత్వం వారికి అందించే ప్రోత్సాహకాల వల్ల మహిళలు ఆర్థిక పరిపుష్టి తో ఆర్థిక సాధికారత సాధించి దేశానికి ఆదర్శంగా నిలుస్తారు.ప్రస్తుతం గ్రామాల్లో భూమి లేని రైతులు రోజువారీ కూలీలుగా పనిచేస్తూ వారికి ఆర్థిక సాయం అందించేందుకు తమ ప్రభుత్వం అర్హులైన భూమిలేని నిరుపేద రైతు కూలీలకు ఏటా రూ.12,000 ఆర్థిక సాయం అందించేందుకు కొత్త కార్యక్రమాన్ని ఈ ఏడాది ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now