Headlines
-
తెలంగాణలో చలి గుప్పెట్లో ప్రజలు గజగజ
-
ఉష్ణోగ్రతలు 10 డిగ్రీలకు దిగజారిన తెలంగాణ ప్రాంతాలు
-
హైదరాబాద్‌లో కోల్డ్ వేవ్ ప్రభావం: ప్రజల కష్టాలు
-
సీజనల్ వ్యాధులు విజృంభణ: ప్రజలకు హెచ్చరిక
-
వాతావరణ శాఖ అంచనా: మరో నాలుగు రోజులు చలి తీవ్రత అధికం
తెలంగాణలో గత కొన్ని రోజులుగా చలి తీవ్రత బాగా పెరిగింది. రోజంతా చలి గాలులు వీస్తున్నాయి. ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. రాష్ట్రంలోనే అత్యల్పంగా రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్ కు పడిపోయాయి.
సంగారెడ్డి జిల్లా కోహిర్ లో కనిష్టంగా పది డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైతే, అసీఫాబాద్ జిల్లా సిర్పూర్లో 9.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇక ఏజెన్సీ ప్రాంతాలలో చలి తీవ్రత అధికంగా ఉంది. గ్రేటర్ హైదరాబాద్ లో సైతం కోల్డ్ వేవ్ కొనసాగుతున్నది. గ్రేటర్ ప్రజలు చలిపులి పంజా దెబ్బకు గజగజలాడుతున్నారు.
మొత్తం మీద తెలంగాణ వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉంది. దీంతో ప్రజలు సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నారు. జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్న వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. వాతావరణ శాఖ సమాచారం మేరకు మరో నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో చలి తీవ్రత ఎక్కువగా ఉండటమే కాకుండా ఉష్ణోగ్రతలు మరింత పతనమయ్యే అవకాశాలున్నాయి.