*మోడీ ప్రభుత్వం ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని ఆపాలి*
*సార్వత్రిక సమ్మెలో తెలంగాణ రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి చెల్పూరి రాము.*
*జమ్మికుంట ఇల్లందకుంట జులై 9 ప్రశ్న ఆయుధం*
నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రభుత్వ వనరులను పెద్ద మొత్తంలో గుత్తా పెట్టుబడుదారుల చేతిలోకి వెళ్తున్నాయని ముఖ్యంగా ఆదానీ, అంబానీ వంటి కార్పొరేట్ గ్రూపుల చేతుల్లోకి వెళ్లేందుకు కృషి చేస్తుందని చెల్పూరి రాము, విమర్శించారు ఇల్లందకుంట మండల కేంద్రంలో సార్వత్రిక సమ్మె లో భాగంగా నిరసన వ్యక్తం చేసిన చెల్పూరీ రాము మాట్లాడుతూ ప్రభుత్వ రంగ సంస్థలను ఒక క్రమ పద్ధతిలో మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తుందని ఈ విధానాల వల్ల భారత దేశ స్వాలంబన ను బలహీన పరుస్తూ ప్రజలకు అత్యవసర సేవలను అందుబాటులో లేకుండా మోడీ ప్రభుత్వం చేస్తుందని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న నయా ఉధరవాద నమూనా వలన రికార్డ స్థాయిలో ఆర్థిక అసమానతలు పెరుగుతున్నాయని దేశంలో ఉన్న సంపద కొద్దిమంది శతకోటీశ్వరుల చేతిలో పెట్టేందుకు మోడీ ప్రభుత్వం కృషి చేస్తుందని విమర్శించారు. మోడీ ప్రభుత్వం తక్షణమే ప్రభుత్వ రంగాన్ని అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. కార్మికులకు ప్రయోజనం చేసే చట్టాలను తొలగించే విధానాలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగంలో కార్పొరేట్ విధానాలను మోడీ ప్రభుత్వం అమలు చేసే విధానాన్ని అనుసరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని నూతన జాతీయ విద్యా విధానాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్ లను బలవంతంగా రుద్దే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో ప్రజా ఉద్యమాల ద్వారా అడ్డుకుంటామని హెచ్చరించారు. తక్షణమే నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి కొత్తూరి మల్లయ్య, గంధసిరి సంపత్, భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షులు జమకం వెంకన్న, మండల అధ్యక్ష కార్యదర్శులు రావు ఎల్లయ్య, రేణి కుంట్ల సారయ్య, తెలంగాణ ఆల్ పెన్షనర్స్ & రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోసియేషన జిల్లా సహాయ కార్యదర్శి సదయ్య, అమాలి సంఘం మండల అధ్యక్షులు శ్రీనివాస్, కనకయ్య, ప్రభాకర్, శ్రీనివాస్, నరేష్, కృష్ణమూర్తి, సారయ్య, రాజు, తిరుపతి, వెంకన్న కార్మికులు తదితరులు పాల్గొన్నారు.