Headlines
తెలంగాణ ప్రభుత్వంచే 100% ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమం
తెలంగాణ ప్రభుత్వంచే 100% ఉచిత చేప పిల్లల విడుదల కార్యక్రమామూలో మహబూబాబాద్ ఎమ్మెల్యే…భూక్య మురళి నాయక్
మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని కంబాలచెరువులో , మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా మత్స్యశాఖ అధికారులతో కలిసి ఒక 63 వేల చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన మహబూబాబాద్ నియోజకవర్గ శాసన సభ్యులు* డా. భూక్యా మురళీ నాయక్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీ నాయక్ మాట్లాడుతూ మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధియే ద్వేయంగా చేప పిల్లలు పంపిణీ చేసినట్లు తెలిపారు, నియోజకవర్గంలో అన్ని మండలాల్లో చేప పిల్లలు పంపిణీ చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, చేపల ఉత్పత్తి గణనీయంగా పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తుందని సూచించారు._ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ , వార్డ్ కౌన్సిలర్లు, మండల పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ,అధికారులు ,మత్స్యకారులు, కార్యక్రమంలో పాల్గొన్నారు