తెలంగాణకు సెప్టెంబర్ 17న స్వతంత్రం వచ్చింది..

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా మున్సిపల్ అధ్యక్షుడు శ్రీనివాస్ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పట్లోళ్ల విక్రం రెడ్డి హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు వారు మాట్లాడుతూ దేశమంతా ఆగస్టు 15 న స్వాతంత్రం వస్తే మన తెలంగాణకి మాత్రం సెప్టెంబర్ 17న 13 నెలల ఆలస్యంగా స్వాతంత్రం వచ్చింది అని, సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాం నవాబు మెడలు వంచి తెలంగాణ ను విమోచనం చేయడం జరిగింది. తెలంగాణ ప్రజలందరూ సర్దార్ వల్లభాయ్ పటేల్ కి కృతజ్ఞతలు తెలుపుకోవాల్సిన రోజు మనమందరం ఆ మహనీయునికి రుణపడి ఉండాలని వారు తెలియజేశారు ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ అమరం మోహన్ రెడ్డి, కౌన్సిలర్లు అమరం సరస్వతి, దొడ్ల మల్లికార్జున్, సీనియర్ నాయకులు మలిగే అశోక్, చెంచల సురేష్, బీజేవైఎం మున్సిపల్ ప్రెసిడెంట్ బట్టి కాడి విక్రమ్, మున్సిపల్ ప్రజలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now