1948సెప్టెంబర్ 17న తెలంగాణకు స్వాతంత్రం వచ్చింది..

*తెలంగాణకు నిజమైన స్వాతంత్రం వచ్చింది1948 సెప్టెంబర్ 17న*

 

*విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించే దమ్ము కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు.*

 

*బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి*

 

*కరీంనగర్ ప్రశ్న ఆయుధం న్యూస్ బ్యూరో సెప్టెంబర్ 17*

 

1947 ఆగస్టు 15న బ్రిటిష్ పాలన అంతమై భారతదేశం మొత్తం స్వతంత్ర సంబరాలు జరుపుకుంటే, దేశం నడి మధ్యలో ఉన్న హైదరాబాద్ మాత్రం నిజాం పాలనలో ఉందని, హైదరాబాద్ సంస్థానం స్వేచ్ఛ వాయువు పీల్చుకోవడానికి ఏడాదికి పైగా సమయం పట్టిందని, తెలంగాణకు నిజమైన స్వాతంత్రం 1948 సెప్టెంబర్ 17న వచ్చిందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను మంగళవారం రోజున బిజెపి జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి పార్టీ కార్యాలయం వద్ద సర్దార్ వల్లభాయ్ పటేల్, భరతమాత చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించి జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు నిజమైన స్వాతంత్ర దినోత్సవమైన సెప్టెంబర్ 17ను అధికారికంగా జరుపుకోలేని దౌర్భాగ్యస్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నందుకు సిగ్గుతో తలదించుకోవాలన్నారు. విమోచన దినోత్సవ వేడుకలను అధికారికంగా నిర్వహించే దమ్ము రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఓవర్గ ఓటు బ్యాంకు మెప్పుకోసం కాంగ్రెస్ ఆరాటపడుతున్నట్టు స్పష్టంగా కనబడుతుందన్నారు గతంలో సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామని బిఆర్ఎస్ మోసం చేస్తే, నేడు కాంగ్రెస్ కూడా అదే మోసం చేసి అదే పంథా లో నడుస్తుందన్నారు ముఖ్యంగా తెలంగాణలో నిజాం, రజాకర్ల ఆగడాలను అరికట్టడానికి, వాళ్ల పాలన నుంచి తెలంగాణకు విముక్తి కల్పించడానికి భారత సైన్యం యుద్ధమే చేసిందన్నారు ఆనాడు ఒక్క మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జోక్యం చేసుకొని ఆపరేషన్ పోలో వంటి సైనిక చర్య చేపడితే రజాకర్లు తోక ముడిచారని నిజాం సంస్థానాన్ని భారత ప్రభుత్వంలో విలీనం చేశారని తెలిపారు. తెలంగాణ స్వాతంత్ర చరిత్ర ప్రతి ఒక్కరూగ్రహించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు అనంతరం ప్రధాని మోదీ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని చైతన్యపురి ప్రధాన రహదారి పక్కన చెట్ల మొక్కలను స్థానిక బిజెపి శ్రేణులతో కలిసి నాటారు అనంతరం బిజెపి సభ్యత్వ నమోదు కోఆర్డినేటర్లు జిల్లా రాష్ట్ర ముఖ్య నేతలతో గంగాడి కృష్ణ రెడ్డి ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని, రాష్ట్రంలోనే కరీంనగర్ జిల్లాను మెంబర్షిప్ లో నెంబర్ వన్ స్థానంలో ఉంచడానికి బీజేపీ శ్రేణులంతా తగిన కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ శాసన సభ్యురాలు బోడిగశోభ, బిజెపి జిల్లా మాజీ అధ్యక్షుడు బాస సత్యనారాయణ రావు మాజీ జెడ్పిటిసి శ్రీరామ్ శ్యామ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్ ఇనుగొండ నాగేశ్వర్ రెడ్డి బంగారు రాజేంద్రప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శులు తాళ్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాడ వెంకట్ రెడ్డి, ఉపాధ్యక్షులు గుర్రాల వెంకటరెడ్డి రంగు భాస్కరాచారి ఎర్రబెల్లి సంపత్ రావు దండు కొమురయ్య, పుప్పాల రఘు జిల్లా అధికార ప్రతినిధులు బొంతల కళ్యాణ్ చంద్ర, ఎడమ సత్యనారాయణ రెడ్డి సుధాకర్ కార్పొరేటర్లు బండ సుమ రమణారెడ్డి, పెద్దపల్లి జితేందర్ అసెంబ్లీ కన్వీనర్లు దుబ్బాల శ్రీనివాస్ గౌతమ్ రెడ్డి ముత్యాల జగన్ రెడ్డి , బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు దురిశెట్టి సంపత్ శశి గాయత్రి శ్రీనివాస్ లక్ష్మణ చారి నరహరి లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now