ప్రత్యేక షోస్‌, టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి..

ఎన్టీఆర్‌ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’ . జాన్వీకపూర్‌ హీరోయిన్‌. సైఫ్‌ అలీఖాన్‌ కీలక పాత్ర పోషించారు. సెప్టెంబర్‌ 27న ఇది ప్రేక్షకుల ముందుకురానుంది. చిత్ర బృందం విజ్ఞప్తి మేరకు.. ప్రత్యేక షోస్‌, టికెట్‌ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.29 థియేటర్లలో సినిమా విడుదల తొలి రోజు అర్ధరాత్రి 1 గంట స్పెషల్‌ షో, దాంతోపాటు అన్ని థియేటర్లలో 6 షోలు (4 గంటల నుంచి ప్రారంభం) ప్రదర్శించేందుకు వెలుసుబాటు కల్పించింది. ఆ స్పెషల్‌ షోలకు టికెట్ ధర రూ.100 పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు.. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో రూ.25, మల్టీప్లెక్స్‌ల్లో రూ.50 పెంచుకునేందుకు అవకాశం కల్పించింది.

‘దేవర’ స్పెషల్‌ షోలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇప్పటికే అనుమతి ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలిరోజు అర్ధరాత్రి 12 గంటల షోతో పాటు ఆరు ఆటలకు అనుమతిచ్చింది.  28వ తేదీ నుంచి ఐదు ఆటలకు పర్మిషన్‌ ఇచ్చింది. అలాగే టికెట్‌ ధరలను సైతం పెంచుకోవడానికి వెసులుబాటు కల్పించింది. సింగిల్‌ స్క్రీన్స్‌లో జీఎస్టీతో కలిసి అప్పర్‌ క్లాస్‌ రూ.110, లోయర్‌ క్లాస్‌ రూ.60, మల్టీప్లెక్స్‌ థియేటర్స్‌లో రూ.135 వరకూ పెంచుకునేందుకు అవకాశం ఇచ్చింది.

Join WhatsApp

Join Now