తెలంగాణ ప్రభుత్వంఉపాధి మరియు శిక్షణ శాఖ
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రవేశాల ప్రోత్సాహార్థం ప్రభుత్వం రూపొందించిన పోస్టర్లు, పాంప్లెట్లు ఆవిష్కరించారు.
కామారెడ్డి జిల్లా ప్రతినిధి(ప్రశ్న ఆయుధం) జూలై 28
ఐ.టి.ఐ. / ఏ.టి.సీ. ప్రవేశాలు తుది దశకు చేరిన నిర్మాణాలు, ఆధునిక కోర్సులలో నైపుణ్య శిక్షణకు సిద్ధం బిచ్కుంద, తాడువాయి, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఉన్న ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్స్ (ఐ.టి.ఐ.) / అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్స్ (ఏ.టి.సీలు) లో 2025–26 విద్యా సంవత్సరానికి ప్రవేశాల రెండవ దశ కొనసాగుతోంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు జూలై 31, 2025 నాటికి ఆన్లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.ఈ కేంద్రాల్లో అందుబాటులో ఉన్న ముఖ్య నైపుణ్య కోర్సులుమ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కంట్రోల్ ఆటోమేషన్ఇండస్ట్రియల్ రోబోటిక్స్ & డిజిటల్ మ్యానుఫ్యాక్చరింగ్ఆర్టిసన్ యూజింగ్ అడ్వాన్స్డ్ టూల్స్బేసిక్ డిజైనర్ అండ్ వర్చువల్ వెరిఫైయర్ (మెకానికల్)
అడ్వాన్స్డ్ సి.ఎన్.సి. మిషనింగ్ టెక్నీషియన్
మెకానిక్ ఎలక్ట్రిక్ వెహికల్అలాగే, ఎలక్ట్రీషియన్, కోపా వంటి సాధారణ కోర్సులు కూడా అందుబాటులో ఉన్నాయి.
ప్రస్తుతం ఏ.టి.సీ.ల భవన నిర్మాణ పనులు తుది దశలో ఉన్నాయి. పరికరాలు, యంత్రాల అమరిక కూడా చివరి దశకు చేరుకుంది. ఈ కేంద్రాలు టీ-గెట్ (Telangana Gateway of Adaptive Training and Employment) పథకం క్రింద ఆధునిక శిక్షణ మౌలిక సదుపాయాలతో విద్యార్థులకు శిక్షణ అందించేందుకు సిద్ధంగా ఉన్నాయి.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ప్రవేశాల ప్రోత్సాహార్థం ప్రభుత్వం రూపొందించిన పోస్టర్లు, పాంప్లెట్లు ఆవిష్కరించారు.అలాగే ఈ సమావేశంలో టీ-గెట్ కమిటీ కామారెడ్డి జిల్లా కన్వీనర్/ప్రిన్సిపాల్ జి. ప్రమోద్ కుమార్, వైస్ చైర్మన్ మరియు అసిస్టెంట్ లేబర్ కమిషనర్ శ్రీ ఎం. కోటేశ్వర్లు పాల్గొని మాట్లాడుతూ
“ఈ ఆధునిక కోర్సులు విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా శిక్షణను అందించి, మెరుగైన ఉపాధి అవకాశాలను కల్పిస్తాయి” అని పేర్కొన్నారు.