Headlines (Telugu)
-
తెలంగాణా ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై దృష్టి
-
పంటల మార్పిడికి ప్రోత్సాహం: 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ విస్తరణ
-
ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం
తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం ఆయిల్ పామ్ సాగుపై ప్రత్యేక దృష్టిసారించింది. రాష్ట్రంలో వ్యవసాయ, అనుబంధ రంగాలను లాభదాయకంగా మార్చేందుకు అన్నిచర్యలు తీసుకుంటోంది. రాష్ట్రంలో పెరిగిన పంటల మార్పిడి ఆవశ్యకత దృష్ట్యా ఆయిల్ పామ్ సాగును పెద్ద ఎత్తున చేపట్టేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్రంలోని 31 జిల్లాల్లో ఆయిల్ పామ్ సాగు విస్తరణ చేపట్టేందుకు 14 కంపెనీలకు అనుమతులిచ్చింది.