Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ ప్రభుత్వ బీసీ రిజర్వేషన్ల నిర్ణయాన్ని స్వాగతిస్తూ బోడుప్పల్‌లో కాంగ్రెస్ పాలాభిషేకం

IMG 20250713 WA0034

*తెలంగాణ ప్రభుత్వ బీసీ రిజర్వేషన్ల నిర్ణయాన్ని స్వాగతిస్తూ బోడుప్పల్‌లో కాంగ్రెస్ పాలాభిషేకం*

మేడ్చల్ జిల్లా బోడుప్పల్ ప్రశ్న ఆయుధం జూలై 13

తెలంగాణ రాష్ట్ర మంత్రిమండలి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తీసుకున్న చారిత్రాత్మక నిర్ణయాన్ని స్వాగతిస్తూ, ఆదివారం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పోగుల నర్సింహా రెడ్డి ఆధ్వర్యంలో ఒక ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ తోటకూర వజ్రేష్ యాదవ్, బీసీ సంఘాల నేతలు, మాజీ ప్రజాప్రతినిధులతో కలిసి లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు.

ఈ సందర్భంగా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ, “బీసీలకు రాజకీయ, సామాజికంగా న్యాయం చేయాలన్న ధ్యేయంతోనే సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గణనీయమైన నిర్ణయం తీసుకుంది. ఇది కేవలం గణాంకాల రిజర్వేషన్ కాదు, ఇది బీసీలకు దిక్సూచి, కాంగ్రెస్ పార్టీ వారిని ఎలా గుర్తించిందనే నిదర్శనం. దేశంలో ఏ బీజేపీ పాలిత రాష్ట్రంలో కూడా ఇంతటి రిజర్వేషన్ బీసీలకు ఇవ్వలేదు. కానీ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకు ధైర్యం, న్యాయం, సముచిత ప్రతినిధ్యం కల్పిస్తోంది” అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, బీసీ సంఘాల ప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Exit mobile version