Headline :
తెలంగాణ గవర్నర్ చేతుల మీదుగా TPGL నాలుగో సీజన్ ప్రారంభం – సీజన్ లో 16 జట్లు
గోల్ఫ్ క్రీడాకారుల ప్రతిభకు చక్కని వేదికగా నిలుస్తున్న శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ ను తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శ్రీ జిష్ణు దేవ్ వర్మ హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ లో ప్రారంభించారు. టాప్ గోల్ఫర్లు, స్నాన్సర్లతో పాటు లీగ్ లో పాల్గొంటున్న టీమ్ ఓనర్స్ సమక్షంలో ఈ లీగ్ అట్టహాసంగా మొదలైంది. రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించిన గవర్నర్ గోల్ఫ్ ఆడి ప్లేయర్స్ ను ఉత్సాహపరిచారు. లీగ్ లో ఆడుతున్న అన్ని జట్ల క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ అత్యున్నత ప్రమాణాలతో నిర్వహిస్తున్న హెచ్ జీఎ గోల్ఫ్ కోర్టును గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ పరిశీలించారు. ఎకో ఫ్రెండ్లీగా గోల్ఫ్ కోర్సును నిర్వహిస్తున్న హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ను గవర్నర్ ప్రత్యేకంగా అభినందించారు. డంపింగ్ యార్డును అద్భుతమైన గోల్ఫ్ కోర్సుగా మార్చి ఈ విధంగా నిర్వహించడం గొప్ప విషయమని గవర్నర్ ప్రశంసించారు.
ఈ సందర్భంగా ప్రసంగించిన గవర్నర్ గోల్ఫ్ తో తనకు వ్యక్తిగతంగా ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. స్వతహాగా గోల్ఫ్ ప్లేయర్ అయిన తనకు హైదరాబాద్ గోల్ఫ్ కోర్సు ఎంతో నచ్చిందన్నారు. ఇక గత మూడు సీజన్ల నుంచి గోల్ఫర్లకు చక్కని వేదికగా ఉన్న శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ కొత్తసీజన్ లోనూ మరింత విజయవంతం కావాలని ఆకాంక్షించారు. లీగ్ లో విజేతకు ఇచ్చే ట్రోఫీని ఈ సందర్భంగా గవర్నర్ ఆవిష్కరించారు. ట్రోఫీ డిజైన్ తనకు ఎంతగానో నచ్చిందని, తెలంగాణ గేట్ కాక చిహ్నాన్ని ట్రోఫీలో పొందుపరచడం అద్భుతమైన ఆలోచనగా అభివర్ణించారు.
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ ప్రారంభోత్సవానికి రావడం సంతోషంగా ఉందని లీగ్ కమీషనర్ సివి రమణారెడ్డి చెప్పారు. టీజీపీఎల్ కొత్త సీజన్ కూడా హోరాహోరీగా సాగతుందని, గోల్ఫర్లు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారని చెప్పారు. లీగ్ సక్సెస్ వెనుక మీడియా పాత్ర కూడా ఎంతో ఉందని ప్రశంసించారు.
హైదరాబాద్ గోల్ఫ్ అసోసియేషన్ ఎంతో నిబద్ధతతో గోల్ఫ్ కోర్సును నిర్వహిస్తోందని HGA ప్రెసిడెంట్ బీవీకే రాజు చెప్పారు. ఎకో ఫ్రెండ్లీగా గోల్ఫ్ కోర్సును రూపుదిద్దడం వెనుక ఎంతో కృషి ఉందన్నారు. మురికి నీళ్ళను శుధ్ధి చేసి గోల్ఫ్ కోర్సు నిర్వహణకు అదే నీటిని వాడుతున్నామని తెలిపారు. ఒక డంపింగ్ యార్డును ప్రపంచ స్థాయి ప్రమాణాలతో కూడిన అందమైన గోల్ఫ్ కోర్సుగా మార్చామని HGA ప్రెసిడెంట్ బీవీకే రాజు చెప్పారు.
గ్లోబల్ గోల్ఫ్ టోర్నీలకు సైతం హైదరాబాద్ వేదికగా నిలుస్తుండడం గర్వంగా ఉందని చెప్పారు. శ్రీనిధి యూనివర్సిటీ శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ కు సపోర్ట్ చేస్తున్న స్పాన్సర్లకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోనే అత్యుత్తమ గోల్ఫ్ కోర్సుగా హైదరాబాద్ గోల్ఫ్ క్లబ్ నిలుస్తుందని చెప్పారు.
ఇక క్రీడల పట్ల శ్రీనిధి యూనివర్సిటీకి ఎప్పుడూ నిబద్ధత ఉంటుందని శ్రీనిధి ఎడ్యుకేషనల్ గ్రూప్ ఛైర్మన్ కటికనేని తాహెర్ మహి చెప్పారు. తెలంగాణ గవర్నర్ గౌరవనీయులు శ్రీ జిష్ణు దేవ్ వర్మ గారి సమక్షంలో నాలుగో సీజన్ ఆరంభం కావడం సంతోషంగా ఉందన్నారు. గవర్నర్ కు శ్రీనిధి తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. శ్రీనిధి యూనివర్సిటీ కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడల్లోనూ విద్యార్థులను ప్రోత్సహిస్తోందని గుర్తు చేశారు.
శ్రీనిధి యూనివర్సిటీ తెలంగాణ ప్రీమియర్ గోల్ఫ్ లీగ్ నాలుగో సీజన్ లో మొత్తం 16 జట్లు పాల్గొంటుండగా… టాప్ 8లో నిలిచిన జట్లు నాకౌట్ స్టేజ్ కు అర్హత సాధిస్తాయి. నవంబర్ 2 నుంచి 16 వరకూ లీగ్ స్టేజ్ పోటీలు జరగనుండగా.. నవంబర్ 24న క్వార్టర్ ఫైనల్స్ , నవంబర్ 27న సెమీఫైనల్స్ జరగనున్నాయి. నవంబర్ 30న ఫైనల్ పోటీలు నిర్వహించనున్నారు.
Participating Teams:
1. TEAM MYSA – Dr. Swetha Gullapalli
2. MYK STRIKERS – Yadama Muralidhar
3. SREENIDHIAN THUNDERBOLTS – Katikaneni Taher Mahi
4. TEAM TEEOFF FAIRMOUNT – Saam Chinoy
5. VALLEY WARRIORS – K. Srihari Babu
6. StarZ – Srinivasu Satti
7. KLR KINGS – K. Laxma Reddy
8. DECCAN NAWABS – Ravinder Nath
9. OORJITA EAGLES – Veer Prakash
10. APOLLO CANCER CRUSADERS – Dr. Vijayanand Reddy
11. MEENAKSHI MAVERICKS – Mahesh Katragadda
12. ATUM CHARGERS – Vivekanand Gaddam
13. TEAM DASOS – G. Krishna Rao
14. GOLDEN EAGLES – Chinta Sasidhar
15. TELANGANA MONARCHS – Mohan Rao Gandra
16. REITZ MASTERS – K. Prasad Rao