సంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ

*సంస్కృతి,సాంప్రదాయాలకు పుట్టినిల్లు తెలంగాణ*

*నియోజకవర్గ ప్రజలందరికీ బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు*

*సద్దుల బతుకమ్మకు వర్ణ దేవుని అడ్డంకి జోషులు వర్షాన్ని సైతం లెక్కచేయని మహిళలతో బతుకమ్మ ఆడిన ప్రణవ్*

 

*జమ్మికుంట ప్రశ్న ఆయుధం అక్టోబర్ 10*

 

సాంస్కృతి సంప్రదాయాలకు పుట్టినిల్లుగా తెలంగాణ ఉందని ప్రతి పండుగలో ఒక ప్రత్యేకత ఉంటుందని తెలంగాణ ప్రజలు విశ్వసిస్తారని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఒడిదల ప్రణవ్ అన్నారు ప్రకృతికి మానవాళి మనుగడకు ప్రతిరూపం బతుకమ్మ పండుగ అని సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకొని వివిధ మండల కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. తీరొక్క పూల తీసుకొచ్చి బతుకమ్మగా అలంకరించి పువ్వులను దైవంగా భావించి బతుకమ్మలను చుట్టూ మహిళలు చేరి ప్రార్థిస్తారని ప్రతి వస్తువులు ఏదో ఒక వైవిధ్య ఉంటుందని ఇతిహాసాలు పురాణాల ప్రకారం సాంస్కృతి సంప్రదాయాల పట్ల తెలంగాణ ఆడపడుచులు భక్తిశ్రద్ధలతో పూజిస్తారని అన్నారు నియోజకవర్గం ప్రజలకు మహిళలకు బతుకమ్మ,విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.ప్రతీ సంవత్సరం బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందని,మన సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచానికి ఆదర్శమని పూలను దేవుళ్ళుగా కొలిచే సంస్కృతి ప్రపంచంలో ఎక్కడా లేదని ఇలాంటి సంస్కృతి తెలంగాణలోనే ఉందని అన్నారు హుజురాబాద్,జమ్మికుంట పట్టణాల్లో ఏర్పాటు చేసిన బతుకమ్మ వేడుకల్లో ఆయన పాల్గొని మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు.బతుకమ్మ వేడుకల్లో వరణుడు నేను సైతం అంటూ తన జల్లులతో మహిళల వేడుకలకు ఉత్సాహాన్ని కలిగించగా,అటు ప్రణవ్,ఇటు వరణుడి రాకతో బతుకమ్మ ప్రాంగణమంతా సంబరాలతో మారుమ్రోగింది తన వెంట కాంగ్రెస్ నాయకులు మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న కోటి కౌన్సిలర్లు మల్లయ్య రాము శ్రీహరి కాంగ్రెస్ సీనియర్ నాయకులు సదానందం సారంగపాణి రామారావు పూదరి రేణుక శివ సలీం అశోక్ రాజు తదితర నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now