లోకయుక్త కేసులో డిఎల్ఎన్ చారి v/s డిపిఆర్ఓకార్యాలయం,

కేసులో
Headlines in Telugu
  1. అక్రిడిటేషన్ కార్డుల జారీపై తెలంగాణ జర్నలిస్టుల ఆవేదన
  2. ప్రజాసేవలో జర్నలిస్టుల పాత్ర: టీజేఎస్ఎస్ డిమాండ్లు
  3. నిజామాబాద్ అక్రిడిటేషన్ సమస్య: విచారణకు టీజేఎస్ఎస్ విజ్ఞప్తి
  4. డిపిఆర్ఓ ప్రవర్తనపై సీనియర్ జర్నలిస్టుల ఆగ్రహం
  5. అక్రిడిటేషన్ కార్డుల జారీకి పారదర్శకత తీసుకురావాలి

తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘండిమాండ్ చేస్తుంది..

మీడియా సంస్థల్లో వివిధ హోదాలలో పనిచేస్తున్న వారు తమ ఆరోగ్యాలు సైతం లెక్కచేయకుండా రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ, ప్రజాస్వామ్య విలువలు కాపాడేందుకు తమ జీవితాలు అర్పిస్తున్నారు.కానీ మీడియా సంస్థల్లో పనిచేస్తున్న వారిలో 90% పైగా దుర్లభమైన జీవితాన్ని అనుభవిస్తుండడం దురదృష్టకరం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందజేస్తున్న అక్క్రిడీటేషన్ కార్డును సైతం నిజాయితీపరులకు అందకుండా చేస్తున్నా విషయం విధితమే. ప్రభుత్వ ఫార్మేట్ లో అడిగిన అన్ని ధ్రువపత్రాలు, ఆర్టికల్స్ ఆన్లైన్ లో జాతచేసిన, మాకు ఇవ్వలేదు అనడం హాస్యాస్పదం. ఆ ఫైలును సైతం కలెక్టర్ టేబుల్ పై కూడా వెళ్లలేదంటే జిల్లా కలెక్టర్ ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.వాస్తవాలు తెలుసుకోకుండా ఏకపక్ష నిర్ణయంతో లోకయుక్తకే తప్పుడు సమాచారం పంపడంపై సీనియర్ జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


ప్రభుత్వ అధికారి ప్రజల పట్ల ఎలా ఉండాలి అనేది చాలా ముఖ్యమైన విషయం.ప్రజాసేవకులుగా ప్రభుత్వ అధికారులు ప్రజలకు అత్యంత సన్నిహితంగా ఉండాలి కానీ నిజామా బాద్ డిపిఆర్ఓ ప్రవర్తన ఇందుకు భిన్నంగా ఉంది.ప్రజల సమస్యలను పరిష్కరించడం ప్రభుత్వ అధికారుల బాధ్యత. ప్రభుత్వ అధికారులు తాము ప్రజల సేవకులుగా,తమ బాధ్యతను గుర్తించుకోవాలి.
నిజామాబాద్ జిల్లా జర్నలిస్టుల అక్రిడేషన్ కార్డుల జారీలో భారీగా అవకతలపై, పున పరిశీలన చేయాలని,తెలంగాణ జర్నలిస్టు సంక్షేమ సంఘం యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. అన్ని అర్హతలు ఉన్న జర్నలిస్టులకు గత రెండు సంవత్సరాల నుండి, అక్రిడిటేషన్ కార్డు, హెల్త్ కార్డును అపి మానసిక క్షోభకు గురి చేస్తున్నటువంటి డిపిఆర్ఓ ను వెంటనే సస్పెండ్ చేయాలని, టీజేఎస్ఎస్ డిమాండ్ చేస్తుంది. విచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని,భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూడాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు. ఒక సామాన్యుడి తన సమస్య చెబుతా అంటే అధికారి గెటవుట్ ఫ్రొం మై ఆఫీస్ అని అంటే ఆ సమస్య పరిష్కారం కోర్టు మెట్లు ఎక్కవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. జిల్లా అధికారులు ఇప్పటికైనా తప్పును సరిదిద్దుకొని అర్హులైన జర్నలిస్టులకు అక్క్రిడీటేషన్ కార్డులు కేటాయించాలని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment