Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ కల్లుగీత కార్మిక సమావేశం

IMG 20250714 WA0060

ఈత తాటి చెట్లు పెంచుకోవడానికి గ్రామానికి 10 ఎకరాల భూమి ఇవ్వాలి

 – తెలంగాణ కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు వెంకట్ గౌడ్

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జులై 14

 కామారెడ్డి జిల్లా కేంద్రంలో సోమవారం జరిగిన కల్లు గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం లో జిల్లా అద్యక్షులు వెంకట్ గౌడ్ మాట్లాడుతూ ఈత, తాటి చెట్టు పైనుండి పడి మరణించిన గీత కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే ఎక్స్గ్రేషియా ఇవ్వాలన్నారు. అర్హులైన వారికి టి ఎఫ్ టి లైసెన్సులు, గుర్తింపు కార్డులు, పెన్షన్లను మంజూరు చేయాలి,

560 జీవో ప్రకారం ఈత, తాటి చెట్ల పెంపకంకు 5 ఎకరాల ప్రభుత్వ భూమి ఇవ్వాలి, ప్రభుత్వం భూమిలేని చోట్ల కొనివ్వాలని, పట్టా సర్టిఫికెట్ ఇచ్చిన సొసైటీలకు భూమి పొజిషన్ చూపించాలన్నారు.

 అక్రమ మద్యం బెల్టు షాపులను అరికట్టాలని,

కల్లుగీత కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో 5000 కోట్లు కేటాయించి, ప్రతి సొసైటీకి 50 లక్షల సబ్సిడీ రుణాలు మంజూరు చేయాలని, ఈత, తాటి చెట్లు నరికి వేసిన వారిపై నాన్ బెయిల్ కేసులు నమోదు చేయాలన్నారు.

 ప్రతి గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు పెట్టడం కోసం స్థలాలు కేటాయించాలని, శాంపిల్ల పేరుతో కల్లు దుకాణాలపై ఎక్సైజ్ అధికారుల దాడులు ఆపాలి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు నారాగౌడ్, శంకర్ గౌడ్, సాయ గౌడ్, రవిందర్ గౌడ్, భస్వగౌడ్, రమేష్ గౌడ్, హన్మగౌడ్, శ్రీనివాస్ గౌడ్, గంగా రాజ్యం గౌడ్, అంజాగౌడ్, హన్మగౌడ్, కృష్ణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version