ఘనంగా తెలంగాణ భాష దినోత్సవ వేడుకలు

ప్రశ్న ఆయుధం న్యూస్ సెప్టెంబర్ 9 (మెదక్ ప్రతినిధి శివ్వంపేట మండలం)

కాళోజీ నారాయణ రావు జయంతి సందర్భంగా మెదక్ జిల్లా శివ్వంపేట మండలం. దొంతి ఉన్నత పాఠశాల లో తెలంగాణ భాష దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు తెలంగాణ భాష దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ఇంఛార్జి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ మాట్లాడుతూ.పుట్టుక నీది చావు నీది బ్రతుకు దేశనిది అని కాళోజీ చెప్పిన మాటలు గుర్తు చేశారు.అలాగే బ్రతకడానికి ఎన్ని భాషలు అయినా నేర్చుకోవాలని కానీ మాతృభాష నీ విస్మరించవద్దని అన్నారు ఈ కార్యక్రమాన్ని తెలుగు భాష ఉపాధ్యాయులు లలిత విజయవంతంగా నిర్వహించారు..అలాగే విద్యార్థులకు పద్యాల పోటీలు చిత్రలేఖనం పోటీలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.విద్యార్థులకు బహుమతులు అందచేశారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రమేష్. అరుణ.వేణుగోపాల్..గౌరీశంకర్ మాలతి శారద పద్మ విజయ వెంకటేష్ శ్రీనివాస్ రాంరెడ్డి పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now