సభ్యత్వ నమోదులో తెలంగాణ ముందంజ..

తెలంగాణ
Headlines (Telugu)
  1. తెలంగాణా బీజేపీ సభ్యత్వంలో ముందంజ
  2. బీజేపీ సభ్యత్వంలో యువత, మహిళల ఆసక్తి పెరుగుతోంది
  3. కామారెడ్డి జిల్లాలో బీజేపీ సభ్యత్వం రెట్టింపు

-కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి

తెలంగాణలో 11 కోట్ల మంది బీజేపీలో సభ్యులుగా చేరారు..

-బీజేపీ లో చేరేందుకు యువత, మహిళలు, వృద్దులు అందరు సిద్ధంగా ఉన్నారు.

-కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సభ్యత్వం పెరిగింది

కామారెడ్డి జిల్లా బీబీపేట
ప్రశ్న ఆయుధం నవంబర్ 02

కామారెడ్డి నియోజకవర్గ పరిధిలోని బీబీపేట మండల కార్యవర్గ సమావేశం మండల కేంద్రంలోని మున్నూరుకాపు సంఘ భవనంలో మండల అధ్యక్షుడు బట్టుపల్లి రంజిత్ గౌడ్ అధ్యక్షతన నిర్వహించడం జరిగింది.
ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట
రమణ రెడ్డి మాట్లాడుతూ. గత సెప్టెంబర్ 2 న ప్రారంభమైన సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రధాని నరేంద్ర మోది ప్రారంభించిన అనంతరం 2 నెలల కాలంలో 11 కోట్ల మంది బీజేపీలో సభ్యులుగా చేరారనీ, బీజేపీ లో చేరేందుకు యువత, మహిళలు, వృద్దులు అందరు సిద్ధంగా అన్నారనీ అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాల్లో బీజేపీ సభ్యత్వం పెరిగిందనీ అన్నారు. సభ్యత్వ నమోదులో తెలంగాణ ముందంజలో ఉందనీ అన్నారు. కామారెడ్డి జిల్లాలో కూడా బీజేపీ సభ్యత్వం గతంతో పోలిస్తే రెట్టింపు అయ్యిందని అన్నారు. అలాగే క్రియాశీల సభ్యులు కూడా గణనీయంగా పెరిగారని అన్నారు.

Join WhatsApp

Join Now