బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుక

బిజెపి ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవ వేడుక

ఎల్లారెడ్డి, సెప్టెంబర్17, (ప్రశ్న ఆయుధం):

బుధవారం గాంధీచౌక్ వద్ద బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. బిజెపి నాయకులు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి, ప్రజలకు తెలంగాణ విమోచన దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా సామాన్యులు సాయుధులై తిరగబడ్డారని గుర్తు చేశారు. నిజాం పాలనకు చరమ గీతం పాడి, రజాకార్ల రక్కసి మూకలను అణిచి తెలంగాణ స్వాతంత్ర్యాన్ని సాధించిన అమరులను స్మరించుకున్నారు.

వేడుకలో బిజెపి నాయకులు బత్తిని దేవేందర్, మర్రి బాలకిషన్, రాజేష్, సతీష్, శివ, గజానంద్, సుజాత తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment