తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు ఘనంగా

ప్రశ్న ఆయుధం,హైదరాబాద్, సెప్టెంబర్ 17:

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు మంగళవారం నగరంలోని పెరేడ్‌గ్రౌండ్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హాజరై నివాళులర్పించారు.

కార్యక్రమంలో కేంద్ర మంత్రులు గజేంద్ర సింగ్ శెకావత్, జి.కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు ఎన్.రామచంద్రరావు కూడా హాజరయ్యారు.

ప్రముఖ పాత్రికేయ నేతలలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కప్పర ప్రసాద్ రావు పాల్గొని ఈ వేడుకలో భాగమయ్యారు. పలు రాజకీయ, సామాజిక నాయకులు కూడా హాజరై తెలంగాణ విమోచన పోరాట వీరులకు నివాళులర్పించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment