*అమరుల త్యాగల ఫలితమే తెలంగాణ రాష్ట్ర విమోచనం*
*తెలంగాణ ప్రజలు స్వేచ్ఛ వాయువులను పీల్చుకున్న రోజు సెప్టెంబర్ 17*
*ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు*
*బిజెపి జమ్మికుంట పట్టణ అధ్యక్షుడు జీడి మల్లేష్*
జమ్మికుంట ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 17
ఎంతోమంది అమరుల త్యాగ ఫలితంగా తెలంగాణ రాష్ట్రానికి విమోచన లభించిందని జమ్మికుంట పట్టణ బిజెపి అధ్యక్షుడు జీడి మల్లేష్ అన్నారు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని మంగళవారం జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని బిజెపి కార్యాలయం దగ్గర కార్యకర్తలతో కలిసి మల్లేష్ జాతీయ జెండా ఎగరవేసారు అనంతరం నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకొని బిజెపి శ్రేణులు కేక్ కట్ చేసి మొక్కలు నాటినారు అనంతరం మల్లేష్ మాట్లాడుతూ భారత్ దేశానికి 1947 ఆగస్టు 15 వ తేదిన స్వాతంత్రం వచ్చిందని దేశం మొత్తం సంబరాలు జరుపుకుంటే తెలంగాణ ప్రాంతం (హైదరాబాద్ సంస్థానం) ఆనాడు నిజాం నవాబు పరిపాలనలో ఉన్నదని గుర్తు చేశారు. నిజాం రాజు తన ప్రత్యేక సైన్యాన్ని (రజాకార్) ఏర్పాటు చేసుకొని దానికి కాసిం రజ్వి అనే ఒక నరరూప రాక్షసుడిని నాయకుడిని చేసి అతని ఆధ్వర్యంలో తెలంగాణలో మహిళ పైన అత్యాచారాలు చేయడం, మహిళలను వివస్త్రలను చేసి బతుకమ్మ ఆడించడం, దోపిడీలు చేయడం, చిన్న పెద్ద తేడా లేకుండా క్రూరంగా హింసించడం జరిగిందని గుర్తు చేశారు. నిజాం దుర్మార్గపు పరిపాలనకు వ్యతిరేకంగా ఎంతో మంది ఉద్యమించి అమరులు అయ్యారని అన్నాడు ఆనాడు భారత దేశ హోంశాఖ మంత్రిగా ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో నిజాంరాజు (హైదరాబాద్ సంస్థానం) ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేయడం జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రజలు 17 సెప్టెంబర్ రోజును స్వేచ్ఛ వాయులు పిలుస్తున్నారంటే దానికి కారణం సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క కృషి అని, అతనిని తెలంగాణ ప్రజలు ఎప్పుడూ స్మరించుకోవాలని మల్లేష్ సూచించారు. జమ్మికుంట మున్సిపల్ మాజీ చైర్మన్ శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ నిజాం పరిపాల నుండి ఈ ప్రాంత ప్రజలకు విమోచనం జరిగిన 17 సెప్టెంబర్ ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు జరిపించకపోవడం దుర్మార్గమని మండిపడ్డారు ప్రత్యేక తెలంగాణ ఉద్యమ సమయంలో ఆనాటి టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ఏర్పడితే తెలంగాణ విమోచన దినాన్ని అధికారికంగా జరుపుతామని చెప్పి ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత,టిఆర్ఎస్ పార్టీ పది సంవత్సరాలు అధికారంలో వుండి అధికారిక ఉత్సవాలు జరపకుండా ఈ ప్రాంత ప్రజలను అవమానపరచారని ఆక్రోసించారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గతంలో టిఆర్ఎస్ ప్రభుత్వాని సెప్టెంబర్ 17 న అధికారికంగా ఉత్సవాలు జరిపించాలని డిమాండ్ చేశాడని, కానీ అతను ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ విషయాన్ని విస్మరించడం దురదృష్టకరమని అన్నారు. గతంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ పార్టీ, ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రెండు కూడా ఎంఐఎం పార్టీకి భయపడి, కొన్ని వర్గాల సంతృస్టికరణ కోసం తెలంగాణ ప్రజలను అవమానించారని నాయకులు తీవ్రంగా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జీడి మల్లేష్, శీలం శ్రీనివాస్,
పల్లపు రవి, ఠాగూర్ రాజేష్, అప్పం మధు యాదవ్ మోతే స్వామి, ఇటికాల స్వరూప, మేక సుధాకర్ రెడ్డి, ఠాగూర్ రాకేష్, మోడెం రాజు పత్తి జనార్దన్ రెడ్డి, ఉడుగుల రవికుమార్ గర్రెపల్లి నిరుప రాణి ఎండి రజియా రాపర్తి ప్రవీణ్, మాదాడి సమ్మిరెడ్డి, ముకుందం సుధాకర్, అప్పల రవీందర్, కొండపర్తి ప్రవీణ్, ఉడుగుల మహేందర్ తాళ్లపల్లి తిరుపతి యాంసాని సమ్మయ్య, కేశ స్వరూప, కనమల లక్ష్మి, కోండ్ల సులోచన మిల్ పూరి రాజు మోతే అర్జున్ వోల్లాల రాకేష్ తదితరులు పాల్గొన్నారు