తెలంగాణ : స్థానిక ఎన్నికలు.. పనుల్లో వేగం పెంచిన అధికారులు
Aug 03, 2025,
తెలంగాణ : స్థానిక ఎన్నికలు.. పనుల్లో వేగం పెంచిన అధికారులు
తెలంగాణ : స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా బ్యాలెట్ పెట్టెలను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను యుద్ధ ప్రాతిపదకన సిద్ధం చేయాలని ఈసీ ఆదేశించడంతో కలెక్టర్లు తమ పనులు వేగవంతం చేస్తున్నారు. బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, ఇతర సామగ్రితో పాటు పూర్తి సమాచారాన్ని నిర్ణీత ఫార్మాట్‌లో ఈసీకి పంపించేందుకు సిద్ధమౌతున్నారు. అటు కొత్తగా ఓటర్ల జాబితాను రూపొందించాలని పంచాయతీరాజ్ శాఖ నిర్ణయించింది. ఈసీ ఆదేశాలకు అనుగుణంగా సన్నాహాలు జోరుగా కొనసాగుతున్నాయి.