Headlines
-
తెలంగాణలో స్థానిక ఎన్నికలకు మరింత ఆలస్యం
-
బీసీ రిజర్వేషన్లు ఇంకా అనిశ్చితిలో: డెడికేటెడ్ కమిషన్ పనులు కొనసాగుతున్నాయి
-
కులగణన సర్వే న్యాయ సవాళ్లతో నిలిచిపోవచ్చు
-
మహారాష్ట్ర ఓటమి ప్రభావం: కాంగ్రెస్ ఆందోళనలో
-
స్థానిక ఎన్నికలపై పార్టీ నేతల మధ్య విభిన్న అభిప్రాయాలు
ఇంకా పూర్తికాని బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ
కొనసాగుతున్న డెడికేటెడ్ కమిషన్ సమావేశాలు
కులగణన సర్వేకు న్యాయపరమైన చిక్కులు
మహారాష్ట్ర ఓటమి నేపథ్యంలో వెనకడుగు
ప్రతికూల ఫలితాలు వస్తాయనే ఆందోళన
హైదరాబాద్, నవంబర్ 24 : వచ్చే నెలాఖరులోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని సర్కారు ఘంటాపథంగా చెప్తున్నా.. క్షేత్రస్థాయిలో పరిస్థితులు భిన్నంగా కనిపిస్తున్నాయి. ఇటీవల ప్రభుత్వం వేసిన డెడికేటెడ్ కమిషన్ సమావేశాలు కొనసాగుతుండటం, కులగణన సర్వే ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం లేకపోవడం, బీసీ కమిషన్ అభిప్రాయ సేకరణ కూడా గడువులోగా పూర్తయ్యేలా కనిపించకపోవటంతో ఎన్నికల వాయిదా అనివార్యంగా కనిపిస్తున్నది. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్‌కు జరిగిన ఘోర పరాభవ భయంతో ఇప్పట్లో స్థానిక ఎన్నికలకు వెళ్లకపోవడమే ఉత్తమమని కొందరు మంత్రులు, పార్టీ ముఖ్యులు వారిస్తున్నట్టు తెలిసింది.
*తప్పని పరిస్థితుల్లో డెడికేటెడ్ కమిషన్*
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పిన కాం గ్రెస్..ఈ దిశగా చర్యలు చేపట్టలేదు. ఓ దశలో రిజర్వేషన్లు ఇవ్వకుండానే పాత విధానంలోనే ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించింది. బీసీ వర్గాల మంత్రులు, ఎమ్మెల్యేలు అభ్యంతరం చెప్పడంతోపాటు బీసీ సంఘాల నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఇది బలహీనవర్గాలను మోసం చేయడమేనని ఆగ్రహం వ్య క్తంచేశారు. హైకోర్టులోనూ పిటిషన్లు వేశారు. కోర్టు కూడా రిజర్వేషన్ల అమలుపై ప్రభుత్వం చిత్తశుద్ధిని శంకించడంతో ఎన్నికల నిర్వహణ కు వెనుకడుగు వేసింది. ఈ క్రమంలో బీసీ రిజర్వేషన్లు తేల్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పింది. బీసీ కమిషన్‌నే డెడికేటెడ్ కమిషన్‌గా గుర్తించాలని కోర్టు దృష్టికి తీసుకెళ్లగా అంగీకరించలేదు. తప్పనిసరి పరిస్థితుల్లో నవంబర్ 4న డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తు తం కమిషన్ జిల్లాల్లో పర్యటిస్తూ వివరాలు సేకరిస్తున్నది. పూర్తిచేసి సర్కారుకు నివేదిక అందించాలంటే మరో నెల రోజులు పట్టవచ్చని అధికారులు చెప్తున్నారు.
*కోర్టులో కులగణన సర్వే చెల్లుబాటు డౌటే!*
ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బీసీ రిజర్వేషన్ల అమలుతోపాటు సామాజిక వర్గాల లెక్క తేల్చాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇం దులో భాగంగా నవంబర్ 6 నుంచి కులగణనను ప్రారంభించింది. ఈ నెలాఖరులోగా పూర్తిచేయాలని అధికారులకు నిర్దేశించింది. సర్వే ఆశించిన మేర ముందుకుసాగడం లేదు. ఇంటింటికి వెళ్లి వివరాల సేకరణ పూర్తి చేయాలంటే మరో 10 రోజులకుపైగా పట్టే అవకాశమున్నది. సేకరణ పూర్తయినా ఆన్‌లైన్ చేసేందుకు మరో 20 రోజులు గడువు అవసరమని అధికారులు చెప్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయినా కోర్టులో నిలిచే అవకాశం లేదని న్యా యనిపుణులు అభిప్రాయపడుతున్నారు. కులగణనచేసే అధికారం రాష్ర్టాలకు లేదని పేర్కొంటున్నారు. సుప్రీం కోర్టు నిర్దేశించిన మేరకు ట్రిపుల్ టెస్ట్ పాస్‌కావాల్సి ఉంటుందని చెప్తున్నారు. గతంలో మహారాష్ట్ర, కర్ణాటక, బీహార్‌లోనూ కులగణన చేపట్టినా కేంద్రం ఒప్పుకోలేదని ఉదహరిస్తున్నారు. రాష్ట్రంలోనూ కులగణన సర్వే కోర్టులో చెల్లుబాటయ్యే పరిస్థితి ఉండదని విస్పష్టంగా చెప్తున్నారు.
*మహారాష్ట్రలో పరాభవంతో వెనుకడుగు..*
మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాభవంతో తెలంగాణలో స్థానిక ఎన్నికలపైనా ఆ ప్రభావం పడుతుందని భావించిన పలువురు మంత్రులు, పార్టీ ముఖ్యులు ఇప్పట్లో ఎన్నికలు వద్దని వారిస్తున్నట్టు తెలిసింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పెద్దలతోపాటు సీఎం రేవంత్, పలువురు మంత్రు లు తెలంగాణలో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని ఊదరగొట్టినా అక్కడి జనం నమ్మలేదు. ఇక్కడా రేవంత్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలులో విఫలమైంది. నిధుల కొరతను సాకుగా చూపుతూ పథకాలన్నీ పక్కనబెడుతున్నది. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు వెళ్లడం అంతమంచిది కాదని పార్టీ నా యకులు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికలు నిర్వహించి లేనితలనొప్పిని తెచ్చుకోవడం ఎందుకని యోచిస్తున్నట్టు తెలిసింది.