తెలంగాణా మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్ నూతన కార్యవర్గ ఎన్నిక
– హాజీరైన సిఐటియు జిల్లా నాయకులు
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
తెలంగాణా మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ యూనియన్( టీ ఎం ఎస్ ఆర్ యు ) సర్వ సభ్య సమావేశం ఆదివారం కామారెడ్డి లో జిల్లా కార్యాలయంలో నిర్వహించుకున్నారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులు గా రాష్ట్ర కార్యదర్శి గుండా శ్రీనివాస్ హాజరు అయి
మాట్లాడుతూ మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ కొరకు ఏర్పాటు చేయబడిన 1976 సేల్స్ ప్రమోషన్ ఎంప్లాయిస్ యాక్ట్ చట్టాన్ని పరిరక్షించాలని, ఫారం ఏ లో ఫార్మా యాజమాన్యాలు నియామక పత్రాలు ఇవ్వాలని, మెడికల్, సేల్స్ రిప్రజెంటేటివ్స్ కి చట్టభద్ధమైన పని విధానాలు రూపొందించాలని,కార్మిక చట్టాలను కాలరాస్తున్న ఫార్మా యాజమాన్యలను శిక్షించాలని కోరారు. కొత్త లేబర్ కోడ్స్ పేరుతో కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను కాలరాస్తున్నాయని, అలాగే అడ్డగోలు గా పెరుగుతున్న మందుల ధరలను తగ్గించాలని, మందులు మందుల పరికరాలపై జిఎస్టి ని పూర్తిగా ఎత్తివేయాలని, ఆన్లైన్లో మందుల అమ్మకాలని నిషేదించాలని, ఫార్మా రంగం లో అవినీతి ని అరికట్టడానికి యు సి పి ఎం పి కోడ్ ని సమర్ధవంతంగా అమలు చేయాలనీ, ప్రభుత్వ రంగ ఫార్మా వాక్సిన్ కంపెనీ లను పునరిద్దరించాలన్నారు. ఈ సమావేశం లో సభ కి హాజరైన సభ్యుల నుండి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్ష కార్యదర్శులు గా శ్రీ రామోజు రవీంద్రా చారీ, గోన్ల ప్రేమ్ కుమార్, ఉపాధ్యక్షులు గా డి మహేందర్ రెడ్డి, ఎం ఏ షకీల్ పాషా, సహాయ కార్యదర్శులు గా బి ఎన్ సంతోష్, ఎస్ రాజేష్, కోశాధికారి గా ఎం జన్ రాజ్, మిగతా కార్యవర్గ సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సమావేశానికి సిఐటియు నాయకులు చంద్రశేఖర్ హాజరై నూతన కార్యవర్గాన్ని అభినందించారు.