తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, ద్వితీయ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయండి.

తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, ద్వితీయ రాష్ట్ర మహా సభలను జయప్రదం చేయండి.

– రాష్ట్ర అధ్యక్షులు యస్, సిద్దిరాములు

ఆయుధం

నిజామాబాదు జిల్లా కేంద్రం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర కార్యాలయం లో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం ,రాష్ట్ర ఆపీసు బ్యారర్స్ ,సమావేశం రాష్ట్ర అధ్యక్షులు యస్, సిద్దిరాములు అధ్యక్షతన సోమవారం నిర్వహించారు. అనంతరం రాష్ట్ర కమిటీ ,2025,ఏప్రిల్ ,29,30,న తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర ద్వితీయ, మహా సభలు,నిజామాబాదు జిల్లా కేంద్రం లో నిర్వహించాలని ఈ సమావేశం లో నిర్ణయం తీసుకుందనీ రాష్ట్ర అధ్యక్షులు సిద్ధిరాములు పేర్కొన్నారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ రాష్ట్ర అధ్యక్షులు, యస్, సిద్దిరాములు, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నగరపు యెల్లయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం,ఆంజనేయులు మాట్లాడుతూ….

తెలంగాణ సాయుధ పోరాట చారిత్రక నేపథ్యం కల్గిన తెలంగాణ నేలపై శ్రామిక బహుజన కార్మిక వర్గాన్ని ఐక్యపరచడం ద్వారా కార్మిక వర్గ భాగస్వామ్యం తో తెలంగాణ లో బహుజనులకు రాజ్యాధికారం, వస్తుంది అనే ఉద్దేశంతో భారత కార్మిక వర్గం నిర్మాత ,నారాయణ మేఘజీ ,పూలే,అంబేద్కర్, మార్క్స్ సిద్దాంత నినాదంతో అవిర్బవించిన ఏక్తెక కార్మిక సంఘం తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, అనుబంధ సంఘం ,2025,ఏప్రిల్ ,29,30,తేదీ ల్లో నిజామాబాదు జిల్లా కేంద్రం లో ద్వితీయ రాష్ట్ర మహా సభ్యులు రెండు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఇట్టి మహా సభలకు తెలంగాణ రాష్ట్రములోని 13,జిల్లాలో ఉన్న బీడీ కార్మికులు, ప్యాకర్లు, బట్టి, చటన్ తదితర కార్మికులు ,ఏప్రిల్ 29,న నిజామాబాదు లో జరిగే భారీ ర్యాలి, బహిరంగ సభలో పాల్గొంటారనీ, ఏప్రిల్ 30,జరిగే ప్రతి నిధుల సభలో 500,మందితో సభ ఉంటుందనీ, రెండు రోజుల పాటు జరిగే ఈ మహా సభలో గత మహా సభల నుండి నేటి వరకు తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం రాష్ట్ర వ్యాప్తంగా చేసిన పోరాట లను సమీక్షించి చర్చించి మరో రెండు సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రములోని బీడీ కార్మికుల సమస్యల ప్తె ఎలాంటి పోరాటాలు చేయాలని ,ఈ రాష్ట్ర ద్వితీయ మహా సభలో నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందువల్లనే ఈ మహా సభలను జయప్రదం చేయాలని కార్మిక వర్గం కు విజ్ఞప్తి చేశారు.

ఈ సమావేశంలో తెలంగాణ బహుళ జన బీడీ కార్మిక సంఘం బిఎల్ టీయూ, రాష్ట్ర ఉపాధ్యక్షులు, నగరపు యెల్లయ్య, బి,జగదీష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యం,ఆంజనేయులు, రాష్ట్ర కోషదికారి,స్తెయ్యద్, నిర్మల్‌ జిల్లా కన్వినర్,చట్ల,పోశవ్వ,నిజామాబాదు జిల్లా కార్యదర్శి, వేణు తదితరులు పాల్గొన్నారు,

Join WhatsApp

Join Now