మా కులం ఆస్తిత్వాన్ని దెబ్బతీయాలని ఎవరు ప్రయత్నం చేసిన తెలంగాణ లో మరో ఉద్యమం..

ఆస్తిత్వాన్ని
Headlines in Telugu
  1. నేతకాని కులం మార్చితే తెలంగాణలో ఉద్యమం – నేతల హెచ్చరిక
  2. కులం ఉనికి దెబ్బతీయడానికి ప్రయత్నిస్తే నేతకానులు ఉద్యమానికి సిద్ధం
  3. తెలంగాణ నేతకాని కులం ఉనికి విషయంలో తీవ్రంగా స్పందించిన సంఘం
తెలంగాణ నేతకాని సంక్షేమ సంఘం రిజిస్ట్రేషన్ 431/2023

హైదరాబాద్ డెస్క్
ప్రశ్న ఆయుధం నవంబర్ 07:

కరీంనగర్ ప్రెస్ భవన్ లో విలేకరులతో మాట్లాడుతున్న దుర్గం మారుతి తెలంగాణ రాష్ట్రంలో నేతకాని కులస్తుల ఉనికి ప్రమాదంలో ఉంది.
తేది: 05-11-2024 రోజు అమర హైదరాబాద్ v6 ఎలక్ట్రానిక్
మాధ్యమంలో తెలంగాణలోని నేతకాని కులాన్ని మాల నేతకాని గా మార్పు చేయాలని గడ్డం వివేకానంద్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలియజేస్తాను అని v6 టీవీ ఛానల్లో స్క్రోలింగ్ లో లో ప్రసారం అయిందని మేము చూడడం జరిగింది. తెలంగాణా రాష్ట్రంలో ఇప్పటి వరకు నేతకాని కులస్తులు ఏ ఒక్క కులం గురించి మాట్లాడలేదు. ఎవరిని తక్కువ చేసి మాట్లాడలేదు. మీరు ఈ విధంగా ఎందుకు మాట్లాడారో ప్రజలకు మీరే సమాధానం చెప్పాలి.
గడ్డం వివేకానంద్ నేతకాని కులానికి బహిరంగ క్షమాపన చెప్పాలి. మీరు నేతకాని కులాని మాల నేతకాని గా మార్చాలని
అమర హైదరాబాద్ / V6 చానల్ లో స్క్రోలింగ్ అయిన మాటలు వెనుకకు తీసుకోవాలి, పెద్దపల్లి పార్లమెంట్ నియోజక వర్గంలో మీ తండ్రి గారైన గడ్డం వెంకటస్వామి ని ఎన్నో సార్లు ఎంపీ గా చేయడంలో మా నేతకానని కులస్తులు ఓటు వేసి గెలిపించారు. మొన్న జరిగిన చెన్నూర్ నియోజకక వర్గంలో మమ్మల్ని ఎమ్మెల్యే గా మీ సోదరుడు గడ్డం వినోద బెల్లంపల్లిలో గెలిపించడంలో మా కులస్తులు ఓటు వేసి గెలిపించారు. ఒకరకంగా చెప్పాటిటే మీ కుటుంబం మా నేతకాని కులానికి రుణపఉంది. మీ కుమారుడు గడ్డం వంశిని ఎంపీ చేయడంలో మా నేతకాని కులస్తులు మీ కుటుంబ సభ్యులకు ఓట్స్ వేసి గెలిపించారు. ఇవ్వన్ని విషయాలు మరచిపోయి మీరు మా నేతకాని కులాన్ని మాల నేతకానిగా మార్చాలని మాట్లాడడం విడ్డూరంగా ఉంది. 1/70 యాక్ట్ లో కేంద్రం ప్రభుత్వముతో మాట్లాడి చట్ట సవరణ చేసి తెలంగాణ లో గోదావరి నది పురివహాక ప్రాంతాలలో నివసించే మా నేతకాని కులస్తులకు భూమిపై పూర్తి హక్కులు కల్పంచే విధంగా ప్రయత్నం చేయండి. దాన్ని ప్రజలు హర్షిస్తారు. అభివృద్ధి విషయాలు మాట్లాడాలి గాని కులల గురించి మాట్లాడినందుకు అండి.
నేతకాని కులం నేతకాకని కులంగానే ఉండాలని మిడియా ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి తెలియజేస్తున్నాము. పెద్దపల్లి పార్లమెంట్ పరిధిలో గత సంవత్సరంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి నేతకాని కులస్తులు చాల ఎక్కువ మంది ఉన్నారని వారికి ఒక ప్రత్యేక నేతకాని కార్పొరేషన్
ఏర్పాటు చేస్తామని హామి ఇచ్చిన విషయం మీరు మర్చిపోయారు. మనిషికి వివేకం ఎక్కువ అయితే ఇతర కులస్తులు బిన్నగా కనిపిస్తారని మీ మాటలు చూసిన తర్వాత తెలిసింది. ఎస్సీ నేతకాని కులాన్ని కించపరినట్లు మాట్లాడిన మీరు బహిరంగా క్షేమాపన చెప్పి మీరు మిడియా ద్వారా నేతకాని కులాన్ని మాల నేతకాని గా మార్చాలనే చెడు ఉద్దేశం బయటపడింది. దాన్ని సవరించండి ముఖ్యమంత్రి మా నేతకాని కులాన్ని నేతకాని కులంగానే ప్రభుత్వ గెజిటెడ్ లో నమోదు చేసేవిధంగా సంబంధిత అధికారులకు ఉత్తర్వులు జారిచేయాలనని కోరుకుంటున్నాము. మా కులం ఉనికికి భంగం కలిగిస్తే నేతకాని కులస్తుల బలమేంటో చూపిస్తాము. తెలంగాణ రాష్ట్ర సాధనలో మేము బాగస్వాములమైన విషయంలో గుర్తించాలని ప్రభుత్వానికి తెలియజేస్తున్నాము. నేతకాని, కులస్తులు ఏ కులానికి వ్యతిరేకం కాదు మమ్మల్ని అవమాన పరిచిన, మా కుల ఉనినికి భంగం కల్గించిన, మా కులం ఆస్తిత్వాన్ని దెబ్బతీయాలని ఎవరు ప్రయత్నం చేసిన తెలంగాణ లో మరో ఉద్యమం మొదలవుతుందని తెలియజేస్తున్నాము. వివేక్ నేతకాని కులాన్ని మాల నేతకాని గా మార్పలనే మాటలు వెంటేనే వెనుకకు తీసుకొవాలని మిడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఒకవేళ అలా జరగకపోతే రాజ్యంగం ప్రకారం మాకు రావలసిన హక్కుల కొరకు నిరంతరం పోరాడుతాము. నేతతకాని కులాన్ని ఇబ్బందులకు గురి చేయాలని ఎవరు ప్రయత్నించిన చట్టం ప్రకారం
న్యాయస్తానాలను ఆశ్రయిస్తామని అలాగే ముందుకు పోవటానికి వెనుకడబోమని మిడియా ద్వారా తెలియజేస్తుతన్నాము.
భవదీయ దుర్గం మారుతి నేత,
న్యాయవాది, రాష్ట్ర అధ్యక్షుడు
కరీంనగర్, తెలంగాణ రాష్ట్రం,
సెల్ నెం. 9849484147
ఈ ప్రెస్ మీట్ లో నాతో పాటు దుర్గం మోహన్ టి ఎన్ ఎస్ ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ట్రెజరీ జాడి రాజు, గోదారి చంద్రయ్య, గోల్లే రమేష్ , జాడి కనకయ్య, గోల్లే లక్ష్మణ్, జాడి కొమరయ్య, బండారి లక్ష్మణ్, గోదారి సంపత్, జాడి రాజు, గోదారి బాలకిషన్, బండారి అంజనేయులు, జే రాజు జాడి ఎల్లయ్య, జే అనిల్ , బండారి గోపి మరియు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now