తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరు..? రేసులో ముందున్న శివధర్‌రెడ్డి!

తెలంగాణ కొత్త పోలీస్ బాస్ ఎవరు? రేసులో ముందున్న శివధర్‌రెడ్డి!

ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనున్న డీజీపీ జితేందర్

కొత్త డీజీపీగా ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్ రెడ్డి పేరు దాదాపు ఖరారు

హైదరాబాద్ సీపీగా మహేశ్ భగవత్ పేరు పరిశీలన

ఏసీబీ డీజీగా సీవీ ఆనంద్, ఇంటెలిజెన్స్ చీఫ్‌గా సజ్జనార్‌కు అవకాశం

పలువురు కమిషనర్లు, ఎస్పీలు, డీసీపీల బదిలీలు తప్పవన్న ప్రచారం

డీజీపీకి కూడా పొడిగింపు లభిస్తుందనే ఊహాగానాలు

తెలంగాణ డీజీపీ జితేందర్ ఈ నెలాఖరులో పదవీ విరమణ చేయనుండటంతో రాష్ట్ర పోలీసు శాఖలో భారీ ప్రక్షాళనకు రంగం సిద్ధమైంది. కొత్త పోలీస్ బాస్ నియామకంతో పాటు పలు కీలక విభాగాల్లో ఉన్నతాధికారుల బదిలీలపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు ప్రారంభించినట్టు తెలుస్తోంది. ఈ పరిణామాలతో పోలీసు శాఖలో ఎవరు ఏ స్థానంలోకి వెళ్తారనే దానిపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం రాష్ట్ర నూతన డీజీపీగా ప్రస్తుతం ఇంటెలిజెన్స్ చీఫ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్న శివధర్ రెడ్డి నియామకం దాదాపు ఖరారైనట్టు తెలుస్తోంది. ఆయనకు డీజీపీగా పదోన్నతి లభిస్తే ఖాళీ అయ్యే ఇంటెలిజెన్స్ చీఫ్ పదవిలో ఆర్టీసీ ఎండీ వీసీ

Join WhatsApp

Join Now

Leave a Comment