Headlines
-
బీసీ రిజర్వేషన్: తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు సన్నద్ధం
-
పల్లెపోరుకు రంగంలోకి అధికారులు: బీసీలకు రిజర్వేషన్!
-
తెలంగాణ పంచాయతీ ఎన్నికలు: నోడల్ అధికారుల గుర్తింపు ప్రారంభం
-
ఫిబ్రవరి నెలలో నిర్వహించనున్న పంచాయతీ ఎన్నికలు: ఏర్పాట్ల పై అధికారులు శ్రద్ధ
-
నల్లగొండ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు: 7,392 వార్డుల్లో ఓటర్ల జాబితా ప్రకటన
బీసీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్!
ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు జనాబా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
బీసీ జనాభాను తేల్చేందుకు ఇంటింటి కుటుంబ సర్వే ఇప్పటికే పూర్తిచేసి ఆన్‌లైన్ ప్రక్రియ చేపట్టింది. బీసీ కమిషన్ కూడా జిల్లాల వారీగా తిరిగి అభిప్రాయ సేకరణ చేపట్టింది. సర్వే వివరాలు పూర్తిస్థాయిలో ప్రభుత్వానికి అందిన తర్వాత ఎన్నికల ప్రక్రియ చేపట్టనుంది.
నల్లగొండ : పల్లెపోరుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉండడంతో అధికార యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇప్పటికే వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రకటించిన అధికారులు.. ఎన్నికల నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ నుంచి బ్యాలెట్ బాక్సులు తెప్పించారు. ప్రస్తుతం నోడల్ అధికారుల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోంది. ప్రభుత్వం ఎప్పుడు ఆదేశించినా ఎన్నికలు నిర్వహించే విధంగా జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది.
7,392 వార్డుల్లో ఓటరు జాబితా ప్రకటన
పంచాయతీ ఎన్నికల నిర్వాహణ కోసం అధికారులు వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసి ప్రకటించారు. జిల్లాలోని మొత్తం 868 పంచాయతీల్లో 10,59,263 మంది ఓటర్లు ఉన్నారు. ఇప్పటి వరకు 856 పంచాయతీల్లోని 7,392 వార్డుల్లో ఓటర్ల జాబితాను ప్రకటించారు. మిగిలిన 12 పంచాయతీల్లోని 90 వార్డుల్లో ప్రకటించాల్సి ఉంది.
*బ్యాలెట్ పద్ధతిన ఎన్నికలు*
పంచాయతీ ఎన్నికల బ్యాలెట్ పద్ధతిన నిర్వహించనున్నారు. జిల్లాలో మొత్తం 7,482 వార్డులు ఉన్నాయి. ఎన్నికల నిర్వహణకు జిల్లాలో ఉన్న 3,676 బ్యాలెట్ బాక్సులు సరిపోవని తేల్చిన అధికారులు ఆంధ్రప్రదేశ్ నుంచి మరో 2,200 బ్యాలెట్ బాక్సులను తెప్పించారు. ప్రస్తుతం వాటిని పరిశీలించి సరిగా లేని వాటికి మరమ్మతు చేస్తున్నారు. మిగిలిన వాటికి ఆయిలింగ్ చేసి సిద్ధం చేయిస్తున్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఒక్కో విభాగానికి ఇన్‌చార్జిలుగా నోడల్ అధికారులను గుర్తించాలని ఆదేశాలు రావడంతో.. జిల్లాస్థాయి అధికారులు ఆ పనిలో నిమగ్నమయ్యారు. ఎన్నికల సిబ్బంది ఎంతమంది అవసరమనే దానిపై నివేదిక సిద్ధం చేస్తున్నారు.
*మూడు విడతల్లో ఎన్నికలు..*
పంచాయతీ ఎన్నికలు మూడు విడతల్లో నిర్వహించనున్నారు. జిల్లాలో పాత మూడు రెవెన్యూ డివిజన్ల వారీగా ఎన్నికలు నిర్వహించనున్నారు. మొదటి విడతలో నల్లగొండ, రెండవ విడతలో మిర్యాలగూడ, మూడవ విడతలో దేవరకొండ డివిజన్ పరిధిలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
ఫ ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించే అవకాశం
*ఫ ఏర్పాట్లలో నిమగ్నమైన యంత్రాంగం*
*ఫ ఏపీ బ్యాలెట్ బ్యాక్సులు తెప్పించిన అధికారులు*
ఫ కొనసాగుతున్న నోడల్ అధికారుల గుర్తింపు ప్రక్రియ*