Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా బండి రమేష్ నియామకం

IMG 20250610 WA1195

*తెలంగాణ పీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా బండి రమేష్ నియామకం*

శుభాకాంక్షలు తెలియజేసిన యువ నేత గాదె శివ చౌదరి.

ప్రశ్న ఆయుధం జూన్ 10: కూకట్‌పల్లి ప్రతినిధి

కూకట్ పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంఛార్జ్‌గా వ్యవహరిస్తూ పార్టీ పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించిన బండి రమేష్‌కు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (పీసీసీ) వైస్ ప్రెసిడెంట్ పదవి లభించడం పట్ల కూకట్ పల్లి యువ కాంగ్రెస్ నేత గాదె శివ చౌదరి హర్షం వ్యక్తం చేశారు.

పార్టీ కోసం నిరంతరం పనిచేస్తూ అంచలంచెలుగా ఎదిగిన బండి రమేష్‌కు ఈ పదవి రావడం నియోజకవర్గానికి గర్వకారణమని ఆయన పేర్కొన్నారు. గత కొంతకాలంగా కూకట్ పల్లి నియోజకవర్గంలో స్తబ్దంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి బండి రమేష్ నాయకత్వంలో మళ్లీ ప్రాణం పోసి, పూర్వ వైభవాన్ని తెచ్చారని అభినందించారు.

ప్రజల సమస్యలను పాదయాత్రల ద్వారా గుర్తించి వాటిని పరిష్కరించడంలో బండి రమేష్ ముందున్నారని అందుకే ప్రజల మన్ననలు ఆయనకి అభినందనలుగా మారాయని తెలిపారు. పార్టీ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషికి గుర్తింపుగానే పీసీసీ వైస్ ప్రెసిడెంట్ పదవి వచ్చిందన్నారు.

బండి రమేష్‌కు నియోజకవర్గం లోని కాంగ్రెస్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు భారీ స్థాయిలో శుభాకాంక్షలు తెలుపుతున్నారని, ఈ పదవితో మరింత గా నియోజకవర్గంలోని ప్రజల అభివృద్ధికి , పార్టీ అభివృద్ధికి కృషి చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

Exit mobile version