Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ జన జీవనానికి పాట ప్రాణం లాంటిది 

IMG 20250713 WA0027 2

– జిల్లా గ్రంథాలయ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి

 

– కామారెడ్డి జిల్లా ప్రతినిధి

(ప్రశ్న ఆయుధం) జూలై 13

తెలంగాణ జన జీవనానికి పాట ప్రాణం లాంటిదనీ

పాటకు సలాం పాటల రచన వర్క్ షాప్ లో

రచయితలుగా, గాయకులుగా సమాజంలో రాణిస్తారని అన్నారు. అనంతరం తెరవే జిల్లా అధ్యక్షులు గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ యువకులను పాటలకు దగ్గర చేయడానికి సమాజాన్ని చైతన్యపరిచి మంచి మార్గంలో నడిపించడానికి పాటలు ఎంతో దోహదపడతాయని,

యువకులకు శిక్షణ శిబిరంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహించామని అన్నారు. ప్రముఖ సంగీత దర్శకులు గాయకులు, అష్టగంగాధర్ మాట్లాడుతూ ఎంతోమంది యువకులు నేడు పాటల రంగంలో రాణిస్తున్నారని పాటల ఊటగా తెలంగాణ పాటకు సలాం చేస్తున్నది అన్నారు. పాటలు రాయడంలో మెలకువలను సూచనలుగా ఈ కార్యక్రమంలో తెలియజేయడం జరిగిందన్నారు. విద్యార్థులు, యువకులు పాటల రచన వర్క్ షాప్ లో పాల్గొన్నారు. ఆలోచింపజేసే పాటలను పాడారు. కళాకారుల బృందం పాటలతో కార్యక్రమాన్ని అలరించింది. అనంతరం బహుమతులను అందజేశారు. ఈ పాటల వర్క్ షాప్ లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధ్రువీకరణ పత్రం అందించారు. విద్యార్థుల విభాగంలో రస్మిత, అక్షిత, సుజిత, యువకుల విభాగంలో జీవన్ కుమార్, సంధ్య

నరసయ్య ,బహుమతులను గెలుచుకున్నారు. వీరితోపాటు కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి

ప్రశంస పత్రాలు మెమొంటోలను అందజేశారు.ఈ కార్యక్రమంలో గజల్ కవి సూరారం శంకర్, మోహన్ రాజ్, శ్యామ్ కుమార్, మౌర్య జీవన్ కుమార్, నాగభూషణం, కాశ నరసయ్య, కమలకాంత్, గంగా ప్రసాద్, సంధ్య, సావిత్రి, కళాకారులు, విద్యార్థులు పాల్గొన్నారు.

 

Exit mobile version