Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టయ్యింది

ప్రజల
Headlines
  1. తెలంగాణలో పథకాల అమలు పరిస్థితి ఏంటీ?
  2. రైతులకు భరోసా లేదంటున్న బీజేపీ నేతలు
  3. కాంగ్రెస్ ప్రభుత్వ పై బీజేపీ ‘6 అబద్ధాలు – 66 మోసాలు’ నివేదిక విడుదల
  4. నిరుద్యోగ భృతి, విద్యార్థుల స్కూటీ: హామీలు ఎక్కడ?
  5. పెనంపై నుండి పొయ్యిలో: తెలంగాణ ప్రజల బాధలపై రాజకీయ విమర్శలు
బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణ తార

ప్రశ్న ఆయుధం న్యూస్, డిసెంబర్ 2, కామారెడ్డి :

తెలంగాణ ప్రజల పరిస్థితి పెనంపై నుండి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని బీజేపీ కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణ తార అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు బీజేపీ జిల్లా కార్యాలయంలో బీజేపీ నాయకులు రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై చార్జిషీట్ విడుదల చేశారు. బీఆర్ ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకతతో కాంగ్రెస్ కి ఓటు వేస్తే అంతకు మించి ఇబ్బందులకు గురి చేస్తోందని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానివి 6అబద్ధాలు- 66 మోసాలని అన్నారు. గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన హామీ కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఎటు పోయిందని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి రైతు భరోసా సరిగా రాలేదని యాసంగి పంటకి రైతు భరోసా, కౌలు రైతులకు భరోసా ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. మహిళలకు ఇస్తానన్న 2500, చదువుకున్న విద్యార్థులకు స్కూటీ, కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఏమైనట్టని ప్రశ్నించారు. గృహజ్యోతి అమలు సరిగ్గా లేదని చాలా మంది ఇబ్బందులు పడుతున్నారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి కొత్తగా ఒక్క పించన్ గాని, రేషన్ కార్డు గాని మంజూరు చేయలేదని దుయ్యబట్టారు. నిరుద్యోగులకు ఇస్తానన్న 4000 నిరుద్యోగ భృతి ఏమైందని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బాణాల లక్ష్మారెడ్డి, నీలం చిన్న రాజులు, రంజిత్ మోహన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు నరేందర్ రెడ్డి, రవీందర్ రావు నాయకులు శ్రీకాంత్, శ్రీనివాస్, లింగరావు, వేణు, తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version