తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు..


దోమకొండ బీబీపేట్ మండలంలోని పాఠశాలలను సందర్శించి పలు సమస్యలను సేకరించడం జరిగింది. ఈ సందర్బంగా, జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ అనిల్ కుమార్ మాట్లాడుతూ, ప్రతి ప్రాథమిక పాఠశాలకు తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాల్సిన అవసరం ఉన్నదని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంతే కాకుండా, పెండింగ్‌లో ఉన్న డీఏలను విడుదల చేయడం, పీఆర్సీ నివేదికను ప్రకటించడం, మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల బదిలీలు పూర్తిచేయడం, కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేయడం, ఎయిడెడ్ పాఠశాలలపై నిర్ణయాలు తీసుకోవడం వంటి అనేక డిమాండ్లను కూడా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ డాక్టర్ నాగభూషణం, జిల్లా కార్యదర్శి సిహెచ్ లింగం, ఎస్. నారాయణ పాల్గొన్నారు.
Post Views: 10