Headlines
-
జగిత్యాల కళాకారుల విజ్ఞప్తి: నిజమైన ఉద్యమ కళాకారులకు ఉద్యోగాలు కల్పించాలి
-
“హలో కళాకారుల చలో హైదరాబాద్” కార్యక్రమం: 32 గంటల ఆటపాట, డప్పుల మోత
-
తెలంగాణ ఉద్యమ కళాకారుల మహాసభలో కళాకారుల హక్కుల కోసం పోరాటం
-
జగిత్యాల జిల్లా మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ చేతులమీదుగా పోస్టర్ ఆవిష్కరణ
12 13 న ఉద్యమ కళాకారుల మహాసభ
తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం నిజమైన ఉద్యమ కళాకారులను గుర్తించి సాంస్కృతిక సారధిలో ఉద్యోగాలు కల్పించి ఆదుకోవాలని జగిత్యాల జిల్లా కళాకారులు కోరుతున్నారు. ఈ మేరకు ప్రభుత్వానికి తమ గళం వినిపించేందుకు ఈనెల 12 మరియు 13వ తేదీలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం హైదరాబాదులో హలో కళాకారుల చలో హైదరాబాద్ పాటల పల్లకిలో 32 గంటల ఆటపాట దగాపడ్డ కళాకారులు డప్పుల మోత కార్యక్రమాన్ని ప్రజా ఉద్యమ సామాజిక గాయకులు నేర్నాల కిషోర్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమ పోస్టర్ జగిత్యాల జిల్లా మున్సిపల్ చైర్మన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది. అలాగే కళాకారులు మాట్లాడుతూ ప్రజా ప్రభుత్వం కచ్చితంగా మాకు ఆదుకుంటదని నమ్మకం ఉందని విశ్వాసాన్ని వ్యక్తం చేశారు ఇట్టి కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం జగిత్యాల జిల్లా అధ్యక్షులు జవ్వాజి శంకర్ మరియు ఉద్యమకారులు.రాగుల రాజు భారతపు లింగారెడ్డి అరుముల్లా ఉమేందర్ గాజుల శ్రీనివాస్ తెలంగాణ దగాపడ్డ ఉద్యమ కళాకారులు అధ్యక్షులు గంగాధర్ నాయక్ ఉపాధ్యక్షులు కునమల్ల సుమన్ కోశాధికారి కండ్లే అంజి. తదితరులు పాల్గొన్నారు