తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్…

తెలంగాణ ఆర్టీసీ గుడ్‌ న్యూస్…

హైదరాబాద్‌ నుంచి బెంగళూరు, విజయవాడ మార్గాల్లో నడుస్తున్న బస్సుల టికెట్‌ధరలపై రాయితీ ప్రకటించింది. ఛార్చీలను 16 నుంచి శాతం వరకు తగ్గించింది. ప్రస్తుతం విజయవాడ నుంచి గరుడ ప్లస్‌ బస్సు టికెట్‌ ధర రూ.635 ఉండగా దాన్ని రూ.444కు తగ్గించింది. గరుడ క్లాస్‌ రూ.592 ఉండగా రూ.438కి తగ్గించింది. ఇక రాజధానీ ఎసీ రూ.533 నుంచి రూ.448కి.. అలాగే లగ్జరీ సూపర్‌ క్లాస్‌ ధరలను రూ.815 నుంచి రూ.685కి తగ్గించేసింది. అలాగే బెంగళూరు రూట్‌లలో చూసుకుంటే సూపర్‌ లగ్జరీ టికెట్‌ ధర ప్రస్తుతం రూ.946 ఉండగా దాన్ని రూ.757కి తగ్గించింది. అలాగే లహరి ఏసీ స్లీపర్ బస్సుల్లో బెర్త్‌ రూ.1569 నుంచి రూ.1177కి, లహరి ఏసీ స్లీపర్ కమ్ సీటర్ ధర రూ.1203 నుంచి రూ.903కి, బెర్త్‌ రూ.1569 నుంచి రూ.1177కి తగ్గించింది. ఈ రాయితీలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌ బుకింగ్‌లు వర్తిస్తాయని ఆర్టీసీ స్పష్టం చేసింది…

Join WhatsApp

Join Now