నర్సాపూర్, అక్టోబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): రైతులు వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసే సమయంలో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే ఆశించిన దిగుబడిని సాధించగలరని తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా ముఖ్య సలహాదారుడు మిర్యాల చంద్రశేఖర్ గుప్తా అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరి ఉత్పత్తిలో వ్యర్థ పదార్థాలు, సేంద్రియ ఎరువుల సమతుల్యం, రంగు మారిన గింజలు, మొలకెత్తిన లేదా పక్వానికి రాని గింజలు, ముడతలు లేదా కుచించుకుపోయిన గింజలు వంటి అంశాలు నేరుగా ధాన్యం నాణ్యతపై ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు. నాణ్యతా ప్రమాణాల పట్టిక ద్వారా ప్రతి అంశం యొక్క గరిష్ఠ పరిమితి వివరించి రైతులకు అవగాహన కల్పించారు. నాణ్యత గల ధాన్యం ఉత్పత్తి చేస్తేనే రైతులకు సరైన ధర లభిస్తుందని, రైతులు సాంకేతిక పద్ధతులను ఉపయోగించి పంట సంరక్షణలో శ్రద్ధ వహించాలని ఆయన సూచించారు.
రైతులు నాణ్యతా ప్రమాణాలు పాటిస్తేనే మంచి దిగుబడి: తెలంగాణ రైతు రక్షణ సమితి మెదక్ జిల్లా ముఖ్య సలహాదారుడు మిర్యాల చంద్రశేఖర్ గుప్తా
Published On: October 30, 2025 6:47 am