తెలంగాణ స్కూళ్లకు ఒంటిపూట…?

తెలంగాణ
Headlines (Telugu)
  1. తెలంగాణ స్కూళ్లలో ఒంటిపూట బడులు: కులగణన సర్వే సమయంలో మార్పులు
  2. కులగణన సర్వే ముగిసేవరకు ప్రాథమిక పాఠశాలలు ఒక్కపూటే
  3. 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారి: కులగణన సర్వే వివరాలు

*కులగణన సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ ఒక్కపూటనే*

ఈనెల 6 నుంచి తెలంగాణలో కులగణన ప్రారంభంకానుంది.సమగ్ర కులగణనకు 36 వేల 559 మంది సెకండరీ గ్రేడ్ టీచర్లను, 3 వేల 414 ప్రైమరీ స్కూల్ హెడ్మాస్టర్లు మరో 8 వేల మంది ఇతర సిబ్బందిని నియమించింది ప్రభుత్వం.సర్వే పూర్తయ్యే వరకు ప్రైమరీ స్కూళ్లు ఒక్కపూటనే నిర్వహించనున్నారు.ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఉపాధ్యాయులు స్కూళ్లలో పనిచేయాలి.తర్వాత కులగణనకు ఇంటింటికి వెళ్లాలి.ప్రతి 150 ఇళ్లకు ఒక పర్యవేక్షణ అధికారితో పాటు కులగణన అధికారులను నియమించింది. 50 ప్రశ్నల ద్వారా డేటా సేకరించనున్నారు అధికారులు.ఇందుకోసం ప్రత్యేకంగా సర్వే కిట్లను అందజేశారు. కులగణనపై ఈనెల 13 వరకు ప్రజాభిప్రాయ సేకరణ ఉంటుందని బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తెలిపారు. ఈ కులగణన సకలజనుల సర్వేలాగా ఉండదన్నారాయన. సర్వే రిపోర్ట్‌ను దాచిపెట్టుకోకుండా ప్రజల ముందు పెడతామన్నారు.

Join WhatsApp

Join Now