తెలంగాణ పరిస్థితి సిబిల్ స్కోర్ బాగున్నా బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితిలో లేవు….శివ చౌదరి

తెలంగాణ పరిస్థితి సిబిల్ స్కోర్ బాగున్నా బ్యాంకులు అప్పులు ఇచ్చే పరిస్థితిలో లేవు….శివ చౌదరి

ప్రశ్న ఆయుధం మే06: కూకట్‌పల్లి ప్రతినిధి

గత పది సంవత్సరాలు కాలంలో సాఫ్ట్వేర్ రంగం గానీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థ,రియల్ ఎస్టేట్ రంగంతో సహా ఏ వ్యవస్థ చూసినా పట్టిందే బంగారంగా పురోగమనంలో ఉంది.

హైదరాబాదులో ఇంటి పునాదులు తీయకముందే సాఫ్ట్వేర్ ఉద్యోగులు వచ్చి పోటీపడి, కట్టుబడి ఎలా ఉన్నా, బిల్డరు అనామకుడైన 10 ఫ్లాట్లు బుక్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్లు.

ఆరోజు ఆర్థిక వ్యవస్థ దూకుడుగా ఉన్న కారణంగా లోన్లు ఇచ్చేవి. బ్యాంకు లోన్లు ఇవ్వాలి ఇవ్వాలి అనే టార్గెట్లు ఎక్కువగా ఉండేవి. బిల్లింగ్ కి పర్మిషన్ ఉందా లేకున్నా, సిబిల్ స్కోర్ తో సంబంధం లేకుండా, ప్రైవేట్ బ్యాంకులు లోన్లు ఇచ్చేవి.

గత మూడు సంవత్సరాల నుంచి ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉంది. అమెరికా, చైనా, యూకే, రష్య లాంటి ప్రపంచాన్ని శాసించే ధనిక దేశాలు దివాలా పరిస్థితిలో ఉన్నాయి. పాకిస్తాన్ లాంటి చిన్న దేశాలు అయితే ఆర్థిక వ్యవస్థలో అడ్రస్ లేవు.

ఉద్యోగులు స్థాయికి మించి అప్పులు చేసి, విలువ లెక్కించకుండా ఖర్చులు పెట్టి ఇవాళ ఇబ్బందుల్లో పడుతున్నారు. మరోవైపు ఫార్మా పరిస్థితి బాగోలేదు.

ఆర్థిక వ్యవస్థ తిరుగమనం వలన ఉన్న కంపెనీల ప్రాజెక్టులన్నిరద్దు చేసుకుంటున్నారు. ప్రైవేటు వ్యవస్థలలో శాలరీలలో ఇంక్రిమెంట్లు లేక, కొత్త జాబులు లేక, ఉన్న జాబులు తీసివేస్తున్నారు.

పెట్టుబడి పెట్టేవారు లేక రియల్ ఎస్టేట్ రంగం కూడా తిరోగమనంలో ఉంది. అలాగే బ్యాంకులు దివాలా పరిస్థితిలో ఉన్నాయి.

బ్యాంకులు వారి వాస్తవ పరిస్థితి ఎవరికి చెప్పుకోలేక, సిబిల్ స్కోర్ ఉన్న అప్పులు అడిగిన వారికి సహకరించలేక సవ లక్ష కారణాలతో వెనక్కి పంపిస్తున్నారు.

తెలంగాణకు గత ప్రభుత్వం చేసిన గుదిబండ లాంటి అప్పులు కూడా ఒక కారణంగా బ్యాంకులు చూపిస్తున్నాయి. గత పది సంవత్సరాల్లో చేసిన తెలంగాణ లో అప్పులు పూర్తిగా సంక్షేమ పథకాలకే ఖర్చు పెట్టారు గాని ఆర్థికంగా రెవిన్యూ జనరేట్ అయ్యే విధంగా ఒక రూపాయి కూడా ఖర్చు పెట్టకపోవడం ఇవాళ తెలంగాణకు తలనొప్పిగా మారింది. గత అప్పు నుంచి ఒక్క రూపాయి కూడా రెవిన్యూ జనరేట్ అవ్వడం లేదు.

తెలంగాణకి గత మూడు సంవత్సరాల నుంచి కేంద్రం బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం కూడా మరో అనుమానానికి బ్యాంకులకు అవకాశం అయింది. మరో కారణం ఆర్థిక వ్యవస్థను అంచనా వేసే బ్యాంకులు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉన్నప్పుడు లోన్లు మంజూరు చేయవు. ఇది జగమెరిగిన సత్యం.

డబ్బు ఉన్నప్పుడు లాగా డబ్బు లేనప్పుడు ఉండకూడదు. ఆర్థిక వ్యవస్థ పరిస్థితి అర్థం చేసుకుంటూ ముందుకు సాగేవాడే నిజమైన ఆర్థిక బలవంతుడు.

Join WhatsApp

Join Now