Site icon PRASHNA AYUDHAM

ఈనెల 18న బందు పర్ జస్టిస్ పేరుతో  తెలంగాణ రాష్ట్ర బంద్

IMG 20251012 WA0077

బీసీ రిజర్వేషన్లపై ఉద్యమ ఉధృతి కోసం బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ ఆవిర్భావం

(బీసీ జేఏసీ ఆవిర్భావం)

చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్

బీసీ రిజర్వేషన్ల సాధన కోసం

ఈనెల 18న బందు పర్ జస్టిస్ పేరుతో  తెలంగాణ రాష్ట్ర బంద్

ఈనెల 13న రహదారుల దిగ్బంధం, 14న రాష్ట్ర బంద్ వాయిదా

ఈనెల 18న తెలంగాణ బంధ్ తో బీసీల బలమేందో చూపిస్తాం

బీసీల నిరసనను గల్లి నుంచి ఢిల్లీ దాకా సెగ పుట్టిస్తాం

జెండాలు ఎజెండాలను పక్కనపెట్టి బీసీలంతా ఒక్కటి కావాలే

బీసీ జేఏసీ ఆవిర్భావ సందర్భంగా

ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్ వెల్లడి

తెలంగాణ రాష్ట్రంలో బీసీ రిజర్వేషన్ల ఉద్యమాన్ని ఉధృతం చేసి, ఎవరికి వారుగా కాకుండా ఐక్యంగా ముందుకు తీసుకుపోవడానికి బీసీ ఐక్య కార్యాచరణ కమిటీ బీసీ జేఏసీ ఏర్పాటయింది

హైదరాబాదులోని హోటల్ అశోకాలో బీసీ సంఘాలు కుల సంఘాలు మేధావులు ఉద్యోగులు సమావేశమై బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు స్టే విధించడం, సుప్రీంకోర్టుల ద్వారా కూడా అడ్డుకోవాలని ఇప్పటికే రెడ్డి జాగృతికి చెందిన నేతలు ప్రయత్నిస్తుండడం తో రాష్ట్రంలోని ప్రముఖంగా ఉద్యమించే బీసీ సంఘాలు సమావేశమై తమ తమ సంఘాల ద్వారా కాకుండా ఉమ్మడి ఎజెండాతో బీసీ జేఏసీ ఏర్పాటు ద్వారా ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానించారు ఈ సందర్భంగా బీసీ జేఏసీ చైర్మన్ గా ఆర్ కృష్ణయ్య, వర్కింగ్ చైర్మన్ గా జాజుల శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ గా విజిఆర్ నారగోని, కో చైర్మన్ లు గా రాజారాం యాదవ్, దాసు సురేష్, సమన్వయకర్తగా గుజ్జ కృష్ణ ను ఎన్నుకున్నారు

బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇవ్వదాన్ని నిరసిస్తూ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఈనెల 13న ఇచ్చిన జాతీయ రహదారుల దిగ్బంధం, ఆర్ కృష్ణయ్య ఈనెల 14న ఇచ్చిన రాష్ట్ర బందును వాయిదా వేసి ఈనెల 18వ తేదీన తెలంగాణ రాష్ట్ర బందును చేపట్టాలని సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయించారు

Exit mobile version