తెలంగాణరాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ మంత్రివర్గ సహచరులతో కలిసి జిల్లాకలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

తెలంగాణరాష్ట్రముఖ్యమంత్రి రేవంత్ మంత్రివర్గ సహచరులతో కలిసి జిల్లాకలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్

 

ప్రశ్న ఆయుధం కామారెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సహచరులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించరు. ఇట్టి వీడియో కాన్ఫరెన్స్లో నీటిపారుదల శాఖ రాష్ట్రంలో వర్షాలు రేషన్ కార్డుల పంపిణీ సీజనల్ వ్యాధుల నియంత్రణ తదితర అంశాలపై జిల్లా కలెక్టర్ లతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు.. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి కలెక్టర్లకు వివిధ అంశాలపై చేపట్టవలసిన చర్యల గురించి తగిన ఆదేశాలు జారీ చేయడం జరిగింది భారీ వర్షాల వల్ల జరిగే ప్రమాదాలను నివారించడానికి డిజాస్టర్ మేనేజ్మెంట్ సేవలు వినియోగించుకోవాలి.. జిల్లాలలో వర్షపాతం గురించి ముందే తెలుసుకొని మూడు గంటల ముందు వర్షపాతం అధికంగా గల ప్రాంతాల్లో తగిన ప్రమాద నివారణ చర్యలు చేపట్టాలి వర్షం గురించి కమాన్ కంట్రోల్ యూనిట్ ద్వారా పర్యవేక్షణ చేయాలి గ్రామీణ ప్రాంతాల్లో పిడుగుపాటు ప్రమాదాల జాగ్రత్తలు తీసుకోవాలి.. సీజనల్ వ్యాధుల నివారణ నియంత్రణ పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలని వారు సూచించడం జరిగింది. దీనిలో భాగంగా దోమల నివారణ గురించి నీటి విలువలు లేకుండా చూడడం గురించి వర్షాల వల్ల వ్యాప్తి చెందే వ్యాధుల గురించి యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సూచించారు ప్రతి మండల స్థాయిలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఏరియా ఆసుపత్రిలో జిల్లా ఆసుపత్రిలో సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో అందరూ అందుబాటులో ఉండేలాగా తగిన చర్యలు చేపట్టాలి జిల్లా కలెక్టర్లు ఆసుపత్రులను వైద్యుల యొక్క హాజరును పర్యవేక్షించడానికి ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి. కలెక్టర్ల ద్వారా చేయు ఆకస్మిక తనిఖీలు పర్యటన వివరాలు పర్యవేక్షించడానికి రాష్ట్రస్థాయిలో అధికారులను ఏర్పాటు చేసి వారి ద్వారా రోజువారి నివేదికలు సమర్పించాలని ఆదేశించారు.. గ్రామీణ మరియు మండల స్థాయిలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలి మరియు అవసరమైన మందులు అందుబాటులో ఉంచాలి… నీటిపారుదల శాఖను ఉద్దేశించి వాటర్ మేనేజ్మెంట్ సరిగ్గా చేయాలి అని సూచించారు వర్షాలను దృష్టిలో ఉంచుకొని వాటర్ మేనేజ్మెంట్ పకడ్బందీగా చేయవలెను అని సూచించడం జరిగింది… వ్యవసాయ శాఖకు సంబంధించి ఎరువుల కొరత లేకుండా చూడాలి మరియు కృత్రిమ ఎరువుల కొరత సృష్టించకుండా తగిన చర్యలు చేపట్టాలి అని సూచించారు జిల్లా కలెక్టర్లు వారి వారి జిల్లాల్లో ఎరువుల దుకాణాల వద్ద ప్రతిరోజూ స్టాక్ పరిస్థితిని నోటీసుబోర్డుల ద్వారా ప్రదర్శించవలెను ఇట్టి స్టాక్ పరిస్థితిని కలెక్టర్లు ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా పర్యవేక్షించాలి. ప్రభుత్వం ద్వారా సరఫరా చేస్తున్న సబ్సిడీ యూరియాను వ్యవసాయ అవసరాలకు కాకుండా ఇతర వ్యవసాయేతర అవసరాలకు వాడుతున్నట్లు ప్రభుత్వం దృష్టికి వచ్చింది కనుక ఇట్టి విషయంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి యూరియాను వ్యవసాయ అవసరాలకు మాత్రమే వినియోగించేలా తగిన చర్యలు చేపట్టాలి. రేషన్ కార్డుల పంపిణీ విషయమై ఇప్పటివరకు 7 లక్షల పై చిలుకు రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా తెలంగాణ రాష్ట్రంలో మూడు కోట్ల 10 లక్షల మందికి సన్నబియ్యం పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఈనెల 25వ తేదీ నుంచి వచ్చే నెల 14వ తేదీ వరకు పూర్తి చేయాలి అన్ని మండల కేంద్రాల్లో నియోజకవర్గాల వారీగా రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం పూర్తి చేయాలి. ఇట్టి రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమంలో జిల్లా మంత్రులు నియోజకవర్గ ఎమ్మెల్యేలు పాల్గొనేలా తగిన ఏర్పాట్లు చేయాలి అని సూచించారు దీనికోసం ప్రతి మండలానికి ఒక అధికారిని కేటాయించి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం సజావుగా జరిగేటట్లు చూడాలి ఉమ్మడి జిల్లా ఇన్చార్జి మంత్రుల పర్యవేక్షణలో ఇట్టి రేషన్ కార్డుల పంపిణీ జరగవలెను లబ్ధిదారులందరికీ రేషన్ కార్డులు అందేలా తగిన చర్యలు చేపట్టవలెను.. భారీ వర్షాల వల్ల ఏమైనా ఆస్తి నష్టం ప్రాణ నష్టం రైతులకు ఏమాత్రం నష్టం కలిగిన సంబంధిత అధికారుల అధికారుల పైన చర్యలు చేపట్టబడును అని ముఖ్యమంత్రి హెచ్చరించడం జరిగింది.

 

ఇ వీడియో కాన్ఫరెన్స్ లో ముఖ్యమంత్రి జారీ చేసిన ఆదేశానుసారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో గల ఎరువుల డీలర్ల యొక్క పూర్తి వివరాలు సేకరించాలని తెలిపారు. రేషన్ కార్డుల పంపిణీకి మండలాల వారీగా కార్యక్రమాలు ఏర్పాటు చేసి నియోజకవర్గ శాసనసభ్యుల ద్వారా ఇట్టి రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించాలని సూచించడం జరిగింది. జిల్లాలో యూరియా వ్యవసాయ అవసరాలకు కాకుండా వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తున్న వారిని గుర్తించి వారిపై తగిన చర్యలు చేపట్టడానికి మరియు యూరియా పంపిణీ అక్కడబందిగా జరగడానికి మండల స్థాయిలో టాస్క్ ఫోర్స్ కమిటీలను ఏర్పాటు చేయాలని కలెక్టర్ ఆదేశించారు.. ఇ వీడియో కాన్ఫరెన్స్ లో బాన్సువాడ సబ్ కలెక్టర్ కిరన్మయి అడిషనల్ కలెక్టర్ లు విక్టర్, చందర్ నాయక్ సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment