తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన 6 గ్యారంటీలను వెంటనే అమలు చేయాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ తక్షణం అమలు చేయాలి అన్నారు.
కోలా లక్ష్మీనారాయణ సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ
ఖమ్మం డివిజన్ కార్యదర్శి పాల్గొని వారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన ఆరు గ్యారెంటీలను అమలు చేయాలని, ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నీ అమలు చేయాలని సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ ముందు ప్రదర్శన, ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ కార్యదర్శి కోలా లక్ష్మీనారాయణ, డివిజన్ నాయకులు షేక్ ఖాసిం, వై ప్రకాష్ లు పాల్గొని మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో గత పాలకులు ప్రజా వ్యతిరేకమైన విధానాలు కొనసాగిస్తున్నందున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని వర్గాల ప్రజలు అనేక పోరాటాలు చేసిన ఫలితంగా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి అధికారాన్ని చేపట్టాడన్నారు. ఎన్నికలకు ముందు అధికారంలోకి రాగానే ఆరు గ్యారెంటీలతోపాటు ఏడవ గ్యారంటీగా ప్రజల ప్రజాస్వామిక హక్కులను పరిరక్షిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేడు రాష్ట్రంలో హక్కులను హరించి వేస్తున్నారన్నారు. ఎన్నికల వాగ్ధానాల అమలులో భాగంగా రైతాంగానికి బ్యాంకులలో ఉన్న పంట రుణాలను మాఫీ చేస్తామని చెప్పి ఇప్పటివరకు మాఫీ చేయలేకపోయారన్నారు. రైతు భరోసా పథకాన్ని అటక ఎక్కించారన్నారు. రైతాంగాన్ని మాయమాటలతో మోసం చేసిన ప్రభుత్వాలు తమ మనుగడ కొనసాగించడం సాధ్యం కాదన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు తమ పెన్షన్ పెంచుతారని ఆశతో సంవత్సర కాలంగా ఎదురుచూస్తున్న పెంచకుండా ఏదో చేశామని సంబరాలు జరుపుకుంటున్నారన్నారు. విజయోత్సవాల పేరుతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నారు. కల్యాణ లక్ష్మి పథకంలో భాగంగా మహిళలకు లక్ష రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తామని ఈనాటికీ ఒక్కరికీ అమలు చేయలేదన్నారు. ఇందిరమ్మ ఇండ్లు ఒక కలగా మిగిలిపోయింది అన్నారు. ఆటో డ్రైవర్లకు నెలకురూ,,1500 లు ఇస్తామని ఈనాటికి అమలు చేయలేదన్నారు. పెండింగ్ లో ఉన్న పోడు భూములన్నింటికీ పట్టాలిస్తామన్నారు కనీసం ఒక్క ఎకరాకు కూడా ఇవ్వలేకపోయారన్నారు. ధరణి పోర్టల్ ను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. రైతు కూలీలకురూ ,,12000 భరోసా ఇస్తామని ఎక్కడ అమలు చేయలేకపోయారన్నారు. తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానని ప్రకటించి కనీసం పట్టించుకునే పరిస్థితిలో ప్రభుత్వం లేదన్నారు. వెంటనే ఆరు గ్యారంటీలను ఎలాంటి షరతులు లేకుండా అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరిచిన హామీలన్నింటినీ అమలు చేయాలని లేనియెడల రాష్ట్రవ్యాప్తంగా సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ దశల వారి ఆందోళన కార్యక్రమాలను కొనసాగిస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఐ(ఎంఎల్)న్యూడెమోక్రసీ ఖమ్మం డివిజన్ సీనియర్ నాయకురాలు పరకాల లక్ష్మక్క, నాయకులు పుచ్చకాయల వెంకటేశ్వర్లు, పాముల మోహన్ రావు, షేక్ సుబహాన్, వై జానకి, కిషన్, సంగక్క, పొట్లపల్లి ప్రసాద్, ఖాసీం ఖాన్, చిర్రా కృష్ణయ్య, షికారు శ్రీను, రాసబంటి రమేష్, చల్లా ఉపేందర్, జి మస్తాన్, భాను తదితరులు పాల్గొన్నారు.
విప్లవాభివందనాలతో
పరకాల లక్ష్మక్క తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment