తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యు నూతన కమిటీ ఎన్నిక

తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యు నూతన కమిటీ ఎన్నిక

నిజామాబాద్ రూరల్, (ప్రశ్న ఆయుధం ఆగస్టు 30): తెలంగాణ రాష్ట్ర ఎన్ ఎస్ యూ ఐ అధ్యక్షులు ఎడవెల్లి వెంకటస్వామి, రాష్ట్ర జనరల్ సెక్రెటరీ వేణు రాజ్ ఆదేశాల మేరకు తెలంగాణ యూనివర్సిటీలో నూతనంగా నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా కమిటీ ఎన్నుకున్నారు. యూనివర్సిటీ ఎన్ ఎస్ యూ ఐ ప్రెసిడెంట్ గా చౌదర్పల్లి మహేష్, వైస్ ప్రెసిడెంట్ గా అరుణ్ తేజ, జనార్ధన్, శివప్రసాద్, జనరల్ సెక్రటరీ గా అలియాస్, అనిల్, తిరుపతి, శివ, బాలాజీ జాయింట్ సెక్రటరీ గా జయంత్, సృజన్, సునీల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ గా దినేష్, మధు మెంబర్స్ గా నితిన్, తరుణ్, మధు, రాజేందర్, కళ్యాణ్, శ్రావణ్, గోవింద్, ముఖేష్, శివ లను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ ఎస్ యూ ఐ మాజీ అధ్యక్షులు బానోత్ సాగర్ నాయక్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలపై పోరాడే ఆర్గనైజేషన్ ఎన్ ఎస్ యూ ఐ ప్రతినిత్యం విద్యార్థుల కొరకు పనిచేస్తూ ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ అధ్యక్షులు శ్రీశైలం, జనరల్ సెక్రెటరీ నవీన్ పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment