” తెలంగాణ రాష్టానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. “

తెలంగాణను నిర్ల్యక్షం చేసిన కేంద్రం జనం చెవుల్లో ‘కమలం’ పూలు. – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం.

ప్రశ్న ఆయుధం ఫిబ్రవరి 02: కూకట్‌పల్లి ప్రతినిధి

” తెలంగాణ రాష్టానికి మరొకసారి దక్కింది గుండు సున్నానే – టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం. ”

కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష స్పష్టంగా కనిపిస్తున్నదని టీపీసీసీ అధికార ప్రతినిధి సత్యం శ్రీరంగం అన్నారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగం పెరుగుతున్న నేపథ్యంలో.. ఉద్యోగాల కల్పన విషయంలో బడ్జెట్లో ప్రతిపాదనలు ఏవీ కనిపించలేదు. ఉపాధి కల్పన పరిశ్రమల ఏర్పాటు పై దృష్టి సారించలేదు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల మాట ఇక మూలన పడ్డట్టే. దేశవ్యాప్తంగా రైతన్నలు కనీస మద్దతు ధర కోసం కొంతకాలంగా ఆందోళనలు చేస్తున్నప్పటికీ.. రైతులకు కనీస మద్దతు ధరపై ఊసే లేదు. అంతా కార్పోరేట్ల అనుకూల బడ్జెట్ మాత్రమే. మరీ ముఖ్యంగా తెలంగాణకు ప్రత్యేకంగా ఎక్కడా బడ్జెట్ కేటాయింపులు లేవు. 8 మంది బీజేపీ ఎంపీలు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ.. తెలంగాణ అభివృద్ధిపై పైసా అదనంగా తీసుకురాకపోవడం దురదృష్టకరం అన్నారు. మెట్రో విస్తరణ, ఫ్యూచర్ సిటీ నిర్మాణం, స్కిల్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీల ఏర్పాటు, మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ తదితర ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు కేంద్రం తన బడ్జెట్లో కనీస సహాయాన్ని ప్రకటించకపోవడం దురదృష్టకరం అని అన్నారు. ప్రకటించిన 50,65,345 కోట్ల బడ్జెట్లో తెలంగాణ వాటా ఎంత? రాష్ట్ర బీజేపీ ఎంపీలు ప్రజలకు ఏం సమాధానం చెబుతారు?… ప్రజల్లో ఎలా తిరుగుతారు? తన ప్రభుత్వం కూలిపోకుండా కాపాడుకునేందుకు మిత్రులని మచ్చిక చేసుకునేందుకే బీహార్, ఏపీ లాంటి రాష్ట్రాలకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటిస్తున్నారు. అన్ని రాష్ట్రాలు అభివృద్ధి చెందినప్పుడే.. దేశం అభివృద్ధి చెందినట్లు అనేది మోడీ ప్రభుత్వం గుర్తు ఎరుగకపోవడం బాధాకరం. గత పదేళ్ల మోడీ సర్కార్ పని తీరును చూసినట్లైతే ఇది కార్మిక, కర్షక, ప్రజా జాతి వ్యతిరేక ప్రభుత్వమని స్పష్టమవుతోంది అని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment