స్థానిక సంస్థల ఎన్నికలలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు పోటీకి సిద్ధంగా ఉండాలి
నిస్వార్ధంగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థి నాయకులే పాలకులు కావాలి
అభ్యర్థి గుణగణాలు ప్రజాసేవకు బలం
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ అన్నం ప్రవీణ్
హుజురాబాద్ ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం
స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు పోటీలో సిద్ధంగా ఉండాలని నిస్వార్ధంగా ఉద్యమించి రాష్ట్రాన్ని సాధించిన విద్యార్థి నాయకుల పాలకులు కావాలని అభ్యర్థి గుణగణాలే ప్రజాసేవకు బలమని ఉద్యమకారుల ఫోరం యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ అన్నం ప్రవీణ్ అన్నారు నాడు తెలంగాణ ప్రాంత ప్రజల హక్కుల కోసం, సంక్షేమం కోసం, భవిష్యత్తు తరాల కోసం, నీళ్లు నిధుల నియామకాల కోసం, పోలీస్ నిర్బంధాలను, కేసులను, అరెస్టులను ఎదుర్కొని తమ చదువులను జీవితాలను, ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలకు దూరంగా ఉండి, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఏ ప్రయోజనం లేకుండా నిస్వార్ధంగా పోరాటం చేసిన వారు తెలంగాణ విద్యార్థులు. అంతటి త్యాగం చేసిన విద్యార్థి ఉద్యమకారులను రాజకీయ పార్టీలు వాడుకొని వదిలేయడంలో ముందంజలో ఉన్నాయని ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో ప్రతి పార్టీకి తెలియజేస్తున్నామని విద్యార్థి ఉద్యమాకారులను గుర్తించి, ప్రతి ప్రధాన పార్టీలన్నీ జైలు జీవితం గడిపిన, అరెస్టుల పాలైన, నిర్బంధాల పాలైన, విద్యార్థి ఉద్యమాకారులకే ‘బి ఫామ్’ కేటాయించి ఉద్యమ త్యాగాలను గుర్తించాల్సిన అవసరం ఉందని తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులతోనే అవినీతి రహిత నాయకత్వం వస్తుందని దాని వల్ల ప్రజలతో ఉన్న అనుబంధం పెరిగి, ప్రజా సంక్షేమం పెరుగుతుందని యువతకు కొత్త స్పూర్తి లభిస్తుందని ఉద్యమ స్ఫూర్తికి నిజమైన గౌరవం అందుతుందని స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంలో, క్షేత్ర స్థాయిలో ప్రజల సమస్యలపై విద్యార్థి ఉద్యమాకారులకే ఎక్కువ అవగాహన ఉందని తెలంగాణ ఉద్యమకారుల యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ అన్నం ప్రవీణ్ పేర్కొన్నారు తెలంగాణ సమాజం పట్ల అంకితభావంతో ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం ఎన్నో త్యాగాలు చేసి, రాష్ట్రాన్ని సాధించుకోవడం కోసం ఎనలేని కృషి చేసిన విద్యార్థి యువతకే క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యల పట్ల అవగాహన ఉంటుందని అటువంటి విద్యార్థి యువ నాయకులకే పాలించే అవకాశం ఇస్తే సంక్షేమాన్ని ప్రజలకు చేరుస్తూ, ప్రజల సమస్యల్లో కష్టసుఖాల్లో పాలుపంచుకునే నైపుణ్యత విద్యార్థి నాయకులకే ఉంటుందని అందుకే, తెలంగాణ ఉద్యమ విద్యార్థి నాయకులకే ప్రాధాన్యం ఇవ్వాలని అందుకోసం రాజకీయ పునరుద్ధరణకు ఇదే సమయమని తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన ఉద్యమంలో విద్యార్థుల పాత్ర అసమానమైనదని తమ స్వంత జీవితాన్ని, చదువులను, భవిష్యత్తును పక్కన పెట్టి, తెలంగాణ ప్రజా హక్కుల కోసం త్యాగం చేసిన వారే ఈ విద్యార్థి నాయకులని వారిలో చాలామంది పాస్‌పోర్టులా విలువైన డిగ్రీలు మధ్యలో వదిలి ఉద్యమంలో నిమగ్నమయ్యారు. తమ కుటుంబ భవిష్యత్‌ను కూడా లెక్కచేయకుండా జైళ్లకు వెళ్లారు. పోలీసులు చేసిన అణచివేతలు, నిందలతో, లాఠీలతో పోరాడారే తప్ప! ఒక్క అడుగు కూడా వెనక్కి వేయకుండా తెలంగాణ ప్రజా ఉద్యమానికే అంకితమయ్యారు. తెలంగాణ ఉద్యమంలో: అనేక మంది విద్యార్థి నాయకులు ఉద్యమంలో తలమునకయ్యారు. కొందరు పోలీసులు పెట్టిన తప్పుడు కేసులతో ఇప్పటికీ కోర్టుల్లో న్యాయం కోసం పోరాడుతున్నారు. తెలంగాణ కోసం తాము నిలబడతామని ముందు వరసలో నిలబడ్డారు .ఈ త్యాగానికి న్యాయమైన గుర్తింపు కావాలని ఇప్పటి రాజకీయ దశలో, ఉద్యమంలో నిబద్ధతతో పనిచేసిన విద్యార్థి నాయకులకు అవకాశం ఇవ్వకపోతే… ఉద్యమ తత్వాన్ని అవమానపరిచినట్లే. పలు ప్రధాన రాజకీయ పార్టీలు, ఉద్యమాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటూ, నిజంగా ఉద్యమాన్ని నడిపిన వారిని విస్మరిస్తున్న పరిస్థితి కనిపిస్తోందని విద్యార్థి ఉద్యమ నాయకులకు ఇప్పటికైనా టికెట్లలో ప్రాధాన్యత ఇవ్వాలని– స్థానిక సంస్థల నుండి శాసనసభ స్థాయి వరకు తెలంగాణ ఉద్యమంలో జైలు జీవితం గడిపిన వారికి ప్రత్యేక అవకాశం ఇవ్వాలని అది ఉద్యమాకారుల త్యాగానికి గుర్తింపు అవుతుందని
ఉద్యమమే ఊపిరిగా పోరాడిన వారికి రాజకీయ గుర్తింపు న్యాయబద్ధమైనదని 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ జరిగింది. ఈ అవతరణ ఎన్నో దశాబ్దాల ఉద్యమాల ఫలితం అని యావత్ భారతదేశం మొత్తానికి తెలిసిన విషయమే. ఎందరో కృషి అమరవీరుల త్యాగాలు, ఉద్యమకారుల పోరాటం అనేక ఉద్యమాల తోనే తెలంగాణ రాష్ట్రం సిద్ధించిందని 1969 లో జరిగిన మహా ఉద్యమం స్ఫూర్తి 2009 ఉద్యమం రాష్ట్రం సాధించడానికి గొప్ప మార్గాలు చూపెట్టింది. తెలంగాణ సమాజమంతా తెలంగాణ జేఏసీగా ఏర్పడి, క్షేత్రస్థాయిలో ప్రజలందరిని చైతన్యం చేసి, తెలంగాణ రాష్ట్రం సిద్ధించేందుకు ఎనలేని కృషిచేసిన ఘనత తెలంగాణ ఉద్యమకారులదే తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన టిఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పదేళ్లు అధికారంలో ఉన్నా కూడా తెలంగాణ ఉద్యమకారులను ముఖ్యంగా, విద్యార్థి ఉద్యమకారులను అత్యంత దారుణంగా నిర్లక్ష్యం చేసిందని ఉద్యమకారుల పక్షాన ఏమాత్రం ఆలోచించకుండా వారి సంక్షేమాన్ని చూడకుండా, వారికి రాజకీయపరమైన ఉద్యోగ పరమైన అవకాశాలు ఇవ్వకుండా, అత్యంత చిన్న చూపు చూసిందని 2023 ఎన్నికల్లో తెలంగాణ ఉద్యమకారుల తిరుగుబాటుతో ఆ పార్టీ అధికారాన్ని సైతం కోల్పోవాల్సి వచ్చిందని 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల్లో ఉద్యమాకారుల అంశాన్ని చేర్చి ఉద్యమకారులను గుర్తించిందని వెంటనే ఆ హామీలను అమలు చేసే ప్రకటన చేయాలని కోరుతున్నామన్నారు అలాగే గత ప్రభుత్వాలు చేసిన తప్పిదాల వల్లనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తెలంగాణ ఉద్యమకారులు ఎంతో కృషి చేయడం జరిగిందని రాజకీయపరంగా కూడా తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం కీలక భూమిక పోషించాలని కోరారు
ఉద్యమాల తొలి పొద్దులు విద్యార్థులు
విద్యార్థులు లేని ఉద్యమం లేదని విద్యార్థులు లేని పోరాటం లేదని కానీ ప్రధాన పార్టీలు మాత్రం తెలంగాణ ఉద్యమకారులను గుర్తించడంలో నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నాయని ఈ దశలో ప్రధాన పార్టీలను తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులను ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గుర్తించి , జడ్పిటిసిలుగా, ఎంపీటీసీలుగా, సర్పంచులుగా తెలంగాణ ఉద్యమకారులకు అవకాశం కల్పించాలని కోరుతూ, అదే స్థాయిలో తెలంగాణ విద్యార్థి ఉద్యమకారులు స్వతంత్ర అభ్యర్థులుగా నైనా ఏ రిజర్వేషన్ వచ్చిన పోటీకి సిద్ధంగా ఉండాలని, సమాజ బాగు కోసం ముందు ఉండేందుకు కృషి చేయాల్సిన బాధ్యత ఉందని
ప్రత్యేక తెలంగాణ కోసం పోరాడిన విద్యార్థి యోధులు ఇప్పుడు ప్రజాప్రతినిధులుగా ముందుకు రావాల్సిన అవసరం ఉందని తెలంగాణ రాష్ట్రం ఏర్పడి దశాబ్దం దాటినా ఆ పునాది రాళ్లు వేసిన విద్యార్థి ఉద్యమకారుల బలిదానాలు ఇప్పటికీ ప్రజల మనస్సుల్లో చెరగని గుర్తుగా నిలిచాయని విశ్వవిద్యాలయాల్లో చదువుకునే వయసులో, ఉద్యమాలకు ప్రాణం పెట్టి, నిర్బంధాలు ఎదుర్కొని, క్షేత్రస్థాయిలో ఉద్యమించి, ఏ పదవులు లేకుండా స్వప్రయోజనం ఏది ఆశించకుండా, జైలు జీవితం గడిపిన వారు తెలంగాణ ఉద్యమ విద్యార్థి యోధులు అని త్వరలో జరగనున్న ఎన్నికలలో జడ్పిటిసి విద్యార్థి ఉద్యమకారులకు ఒక చారిత్రాత్మక అవకాశం. పల్లెల్లో ప్రజల సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న వీరు, స్థానిక పాలనకు అనుకూలమైన నాయకులుగా సేవలు అందించే సమయం ఇదని ఉద్యమంలో చూపిన నిబద్ధతను ప్రజాసేవకు అంకితమిచ్చే సమయమిదని ప్రధాన రాజకీయ పార్టీలకు ఓ విజ్ఞప్తి అని తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యువజన విభాగం రాష్ట్ర కన్వీనర్ అన్నం ప్రవీణ్ పేర్కొన్నారు