ఘనంగా ముగిసిన తెలంగాణ
టిజి సిఎమ్ కప్పు వాలీబాల్ టోర్నమెంట్ ఉత్సవాలు
కెపిహెచ్బి కల్చరల్, వెల్ఫేర్ & స్పోర్ట్స్ అసోసియేషన్, కూకట్పల్లి మాజీ అధ్యక్షులు శేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన
(టిజి సిఎమ్ కప్పు ) వాలీబాల్ టోర్నమెంట్లో ముఖ్య అతిధులుగా తెలంగాణ రాష్ట్ర చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి ఎమ్ ఎల్ సి, మరియు కూకట్పల్లి నియోజకవర్గ ఇన్చార్జ్ బండి రమేష్ పాల్గొని వాలీబాల్ మ్యాచ్ని ప్రారంభించి అనంతరం విచేతలకు బహుమతులు ప్రధానం చేసినారు.
క్రీడలను అద్భుతంగా నిర్వహించిన శేరి సతీష్ రెడ్డి ని వారి అసోసియేషన్ బృందాన్ని అభినందించారు
వైజాగ్ టీం – రెడ్ ఆర్మీ టీంల మధ్య జరిగిన హోరాహోరి ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచిన వైజాగ్ టీం
క్రీడలు యువతలో ఉత్తేజానిస్తూ పెద్దల్లో ఆనందాన్ని,ఆహ్లాదాన్ని పెంపొందిస్తాయని తెలియజేసినారు. క్రీడల్లో కూడా దేశంలో తెలంగాణ మొదటి స్థానంలో ఉండాలని భావించినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనకు ఆచరణ ప్రారంభమైందని అన్నారు చీప్ విప్ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి
ఫైనల్ మ్యాచ్లో విజేతగా నిలిచిన వైజాగ్ టీం ని అభినందించిన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్
యువత తప్పుడు మార్గాల్లో, వ్యసనల బాట పట్టకుండా క్రీడల్లో అవకాశాలను
అందిపుచ్చుకొని ఉద్యోగాలు సాధించాలని ఇలాంటి కార్యక్రమాలు చేరి సతీష్ రెడ్డి ఎంతో అద్భుతంగా గత పదేళ్ల సంవత్సరాల్లో ఇలాంటి కార్యక్రమాలు ఎవరు పెట్టలేరు కల్చరల్ అసోసియేషన్ నుంచి గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు సంక్రాంతికి ముగ్గుల పోటీలు గణతంత్ర దినోత్సవం రోజు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఏర్పడి ఘనంగా ఏడాది పూర్తి సందర్భంగా తెలంగాణ సీఎం వాలీబాల్ టోర్నమెంట్ పెట్టడం కాంగ్రెస్ పార్టీకి ఎంతో మేలు చేస్తుంది అని బండి రమేష్ చెప్పారు.
ఈ కార్యక్రమంలో కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బి సంజీవ్ రావు, మేకల మైఖేల్, జి.వి.ఆర్, AMC చైర్మన్ పుష్పా రెడ్డి, కూకట్పల్లి మాజీ వైస్ చైర్మన్ లక్ష్మయ్య, డైరెక్టర్లు ఫణీంద్ర కుమార్ డివిజనల్ ప్రవీణ్ కుమార్, రాజేష్ గౌడ్, నల్లికాంత్, పులి శివకుమార్ గౌడ్ ,పులి శ్రీకాంత్ గౌడ్,గోపాల్ చౌదరి శ్రీధర్ చారి, రాజు ముదిరాజ్, గిరి నాయుడు, బాబు మహారాజ్, రామకృష్ణారెడ్డి, బి బ్లాక్ అధ్యక్షరాలు సంధ్య , డివిజన్ అధ్యక్షురాలు రజిత, సీనియర్ కాంగ్రెస్ మహిళా నాయకురాలు బండి సుధా, స్వరూప గౌడ్, స్వరూప ముదిరాజ్, మారుతి, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, శ్రేణులు, క్రీడాభిమానులు పాల్గొనడం జరిగింది.