Site icon PRASHNA AYUDHAM

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

IMG 20250806 WA0033

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు

జమ్మికుంట ఆగస్టు 6 ప్రశ్న ఆయుధం

తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ జయంతి వేడుకలు జమ్మికుంట మున్సిపాలిటీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. బుధవారం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అధ్యక్షతన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ విదేశాల్లో తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీదాకా, ఢిల్లీ నుంచి అమెరికా దాకా వ్యాప్తిచేయడంలో ఆయన పాత్ర మరవలేనిదన్నారు. విద్యార్థి దశ నుంచే తెలం‘గానం’ఆచార్య జయశంకర్ విద్యార్థి దశ నుంచే తెలంగాణకు జరుగుతోన్న అన్యాయాల పట్ల, అసమానతల పట్ల తీవ్రంగా పోరాటం చేసిన మహోన్నతమైన వ్యక్తి అని కొనియాడారు 1952 నాన్ ముల్కీ ఉద్యమంలోకి ఆనాటి నుంచి సమరశీల పాత్రను పోషించారన్నారు. విశాలాంధ్ర ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ మొదటి ఎస్సార్సీ కమిషన్ ముందు హాజరై తెలంగాణ వాణిని బలంగా వినిపించిన మేధావి కొత్తపల్లి జయశంకర్ అని, అధ్యాపకునిగా, పరిశోధకుడిగా ఆయన ఏం చేసినా తెలంగాణ కోణంలోనే నిత్యం ఆలోచించి ఆచరించే మహనీయుడు జయంశకర్ అని తెలంగాణ డిమాండ్‌ను 1969 నుంచి సునిశితంగా అధ్యయనం చేస్తూ, విశ్లేషిస్తూ ప్రతీరోజూ రచనలు చేసారన్నారు. తెలంగాణలోని ప్రతీపల్లె ఆయన మాటతో పోరాట గుత్ప అందుకున్నదని, ఆయన తిరగని ప్రాంతం లేదు. తెలంగాణ విషయంలో ఆయన చెప్పని సత్యం లేదు. జాతీయ, అంతర్జాతీయ వేదికలమీద, విశ్వవిద్యాలయాల పరిశోధనా సంస్థల సభలో, సమావేశాల్లో తెలంగాణ రణన్నినాదాన్ని వినింపించిన పోరాట శీలి ప్రొఫెసర్ జయశంకర్ అని కమిషనర్ మహమ్మద్ అయాజ్ ఆయన చూపిన అడుగుజాడల్లో నేటి యువత నడవాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, టౌన్ ప్లానింగ్ అధికారి శ్రీధర్, సీనియర్ అసిస్టెంట్ లు భాస్కర్, వాణి, శ్రీనివాస్, ఏఈ వికాస్, శానిటరీ ఇన్స్ పెక్టర్ మహేష్ లతో పాటు వార్డు ఆఫీసర్లు, సిబ్బంది పలువురు పాల్గొన్నారు.

Exit mobile version